Published On: Tue, Aug 13th, 2019

రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు

* తెదేపా అధినేత చంద్రబాబు

సెల్ఐటి న్యూస్, అమరావతి: విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సందర్భంగా నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. ‘‘2 నెలల్లో మనపై దాడులు పెట్రేగిపోయాయి. వైసీపీ తప్పుడు విధానాలతో వివిధ వర్గాలవారు.. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. భౌతిక దాడులతో పాటు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు. సకాలంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు తొలగించాలని తహసీల్దార్లకు చెప్పారు. ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేద్దాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Just In...