Published On: Fri, Sep 13th, 2019

నేటి నుండి హోటల్ పార్క్ ఎన్‌-లో “ఇరానియన్” ఫుడ్ ఫెస్టివల్

* నగర వాసులకు పసందైన వెజ్, నాన్-వెజ్ రుచులు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: లక్ణ‌నవి వెజ్ బిర్యాని, నావాబి మటన్ బిర్యాని, మటన్ రేజల బిర్యాని, పాలక్ ములి పరోట, జావర్ రోటీ వంటి పేర్లు వింటుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి తినాలనిపిస్తుందా? అయితే పదండి.. భోజన ప్రియుల కోసం “మాన్ సూన్” సందర్భంగా మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సమీపంలోని “పార్క్ ఎన్” హోటల్లో శుక్రవారం “ఇరానియన్ ఫుడ్ ఫెస్టివల్” ప్రారంభమైంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సమీపంలోని హోటల్ పార్క్ ఎన్ నందు శ‌నివారం నుండి “ఇరానియన్ ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నట్లు హోటల్ మేనేజింగ్ డైరెక్టర్లు వెలగపూడి రాఘవ చౌదరి, వెలగపూడి విమలాదేవి అన్నారు. హోటల్ కాన్ఫరెన్స్హాల్ నందు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాఘవ చౌదరి, విమలాదేవి మాట్లాడుతూ రుచికరమైన, శుచికరమైన వంటకాలను అందించడంలో హోటల్ పార్క్ ఎన్ నగరంలోనే ప్రఖ్యాతి గాంచిందన్నారు. ప్రతి ఏటా అనేక సందర్భాలను పురస్కరించుకుని నగర వాసులకు చక్కటి భోజన రుచులను అందించేందుకుగాను వివిధ ఆహారా పదార్థాలతో ఫుడ్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇరానియన్ ఫుడ్ ఫెస్టివల్లో శాఖాహార, మాంసాహార వంటకాలు భోజన ప్రియులకు చక్కటి రుచులను అందించనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లక్షనవి వెజ్ బిర్యాని, నావాబి మటన్ బిర్యాని, మటన్ రేజల బిర్యాని, పాలక్ ములి పరోట, జావర్ రోటీ, మాల్వాని చికెన్ కర్రీ, కోలీవడ్ ప్రాన్స్ కర్రీ, గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ప్రాన్స్, రోటీ-మీ బోటి నాన్ వెజ్, ఫిష్ బీట్స్ అండ్ బైట్స్, మటన్ షాల్లో, ప్రాన్స్ గోలి పకోడ నాన్-వెజ్ స్టార్టర్స్, ఇరాని వెజ్ కబాబ్స్, బ్రెడ్ క్రిప్సి రోల్, వెజ్ కాటేసి సూప్, లహర మటన్ సూప్, హాట్ అండ్ గ్రీన్ పిప్పర్ సూప్ వంటి ఎన్నో వంటకాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రతిరోజూ లంచ్, డిన్నర్‌తో అందించనుననట్లు తెలిపారు. ఒకవేళ హోటల్‌కు రాలేని వారు, ఇంటి వద్దనే ఫుడ్ ఫెస్టివల్ రుచులు ఆస్వాదించాలనుకున్నవారు ‘పార్క్ ఎన్ హోటల్’ చుట్టుప్రక్కల పరిధిలో ఉన్నవారు స్విధీ, జుమోట ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి రుచికరమైన వంటకాలను పొందవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సదర్వినియోగ పరచుకోవాలని హోటల్ మేనేజింగ్ డైరెక్టర్లు వెలగపూడి రాఘవ చౌదరి, వెలగపూడి విమలాదేవి కోరారు. కార్యక్రమంలో హోటల్ జనరల్ మేనేజర్ సి.హెచ్.బాబురావు, చెఫ్స్ సురేష్, బాబర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...