Published On: Thu, Oct 3rd, 2019

బి.వెంకటేష్ బాబు ప్యానెల్ సభ్యులు ఘనవిజయం

* ఎన్నికల అధికారి విద్యాసాగర్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రిజిస్టర్డ్ నెంబర్ 600/2004 రాష్ట్ర కార్యవర్గానికి జరిగిన ఎన్నికలలో బి.వెంకటేష్ బాబు విజయం సాధించారని ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమకృష్ణ అధ్యక్షులు విద్యాసాగర్ ప్రకటించారు. సెప్టెంబర్ 22న  బి వెంకటేష్ బాబు ప్యానల్ మరియు ఏ రమేష్ కుమార్ ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీవో హోమ్ నందు బుధవారం నాడు ఉదయం 10 గంటలనుండి ఎన్నికల నిర్వహించామని, ఎన్నికల ఓటింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే రోజు సాయంత్రం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన 15 మంది సభ్యులను ఎన్నికల అధికారి  అధికారికంగా ప్రకటించారు. బి వెంకటేష్ బాబు ప్యానల్  సభ్యులందరు గెలిపొందరని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఎన్నికల అధికారి ఏ విద్యాసాగర్ సహాయ ఎన్నికల అధికారి పి.రమేష్ గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేపట్టారు. ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమకృష్ణ  జిల్లా ఉపాధ్యక్షుడు యం.రాజుబాబు, సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్, విజయవాడ సిటీ కార్యదర్శి జె.స్వామి, ఉపాధ్యక్షులు సిహెచ్ మధుసూదనరావు, ఎన్జీవో నాయకులు ప్రసాద్ , కిషోర్ వ్యవహరించారు.

Just In...