Published On: Fri, Oct 4th, 2019

గర్భిణీలు, బాలింత‌ల‌కు పౌష్టికాహారంపై సీఎం స‌మీక్ష‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: గర్భిణీలు, బాలింత‌లు, చిన్నారులకు పౌష్టికాహారంపై సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వ‌హంచారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పాల్గొన్నారు.గర్భిణీలు, పిల్లల తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారంపై విస్తృత చర్చ నిర్వ‌హించారు. ఇప్పుడు అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చించిన సీఎం. వీరికి నగదు బదిలీ చేసే అంశంపైనా సుదీర్ఘ చర్చ. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్న సీఎం. వీటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలన్న సీఎం. మధ్యాహ్న భోజనంపైనా సీఎం సమీక్ష. మధ్యాహ్న భోజనం క్వాలిటీ పెంచడంపై దృష్టిపెట్టాలన్న సీఎం. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటుపైనా చర్చ. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వడంపైనా చర్చ. ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు. స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి. నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభం, మార్చికల్లా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు. మొదటి దశలో సుమారు 15వేలకుపైగా స్కూళ్లను అభివృద్ధిచేయనున్న ప్రభుత్వం. స్కూళ్లకు మనం ఇస్తున్న మౌలిక సదుపాయాలు, పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం. సౌర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సీఎం నిర్ణయం. పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దన్న సీఎం. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

Just In...