Published On: Fri, Oct 4th, 2019

దుర్గ‌మ్మ‌కు చిన‌జీయ‌ర్ స్వామి త‌ర‌ఫున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శరన్నవరాత్రులలో 6వ రోజైన శుక్రవారం కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తరపున సీతానగరంలోని ప్రభల ఆహోబిల రామానుజ లక్ష్మీనారాయణస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో ఏర్పాట్లు బాగా చేశారు. ఎక్కడా రద్దీ లేకుండా సజావుగా భ‌క్తులు ముందుకు సాగేలా ఏర్పాటు చేశారు. పిల్లలకు వేడి పాలు సరఫరా చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు వృద్ధులకు, వికలాంగుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించడం పట్ల దేవస్థానం యంత్రాంగానికి , ప్రభుత్వానికి శుభాశీస్సులు అందజేస్తున్నామన్నారు. విష్ణుమూర్తి చెల్లెలైన కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తరపున ఇతిహాసపరంగా మేనత్త వరుస అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేస్తున్నామని తెలిపారు.

Just In...