Published On: Fri, Oct 4th, 2019

శ్రీమ‌హాల‌క్ష్మీ న‌మ‌స్థుభ్యం…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ శుక్ర‌వారం సాక్షాత్కారించారు. న‌మస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే శంఖ చక్ర గడా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే… శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీఅమ్మవారిని శ్రీమహాలక్ష్మీగా అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో 6వ రోజైన శుక్రవారం (ఆశ్వయుజ శుద్ధ షష్టి) ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి, దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీ అనే రూపాల్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేశారు. మూడుశక్తుల్లో ఒక శకైన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడనే అసురుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషమర్దిగా ప్రసిద్ధి పొందింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టి రూపమైన అమృతస్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి ఆశీర్వాచనం కోసం భక్తుల వేలకొలదిగా వచ్చి అమ్మవారి దీవెనలు పొందుతారు.

Just In...