Published On: Wed, Oct 9th, 2019

పోలీసుల ఆయుధ పూజ‌…

* హాజ‌రైన సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ద‌స‌రా ఉత్స‌వాల నేప‌ధ్యంలో మ‌హార్న‌వ‌మి సంద‌ర్భంగా సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌ను పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ కార్యాల‌యంలో సోమ‌వారం న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఆయుధ పూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడ్మిన్ డీసీపి ఎస్‌.హ‌రికృష్ణ‌, లా అండ్ ఆర్డ‌ర్‌-2 డీసీపీ హ‌ర్ష‌వ‌ర్థ‌న‌రాజు, హెడ్‌క్వార్ట‌ర్స్ ఏసీపీ చెంచురెడ్డి, ఆర్‌.ఐ.లు, ఆర్‌.ఎస్‌.ఐ.లు, పోలీసు సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...