Published On: Thu, Nov 7th, 2019

గొల్లనపల్లి హైస్కూల్ విద్యార్థిని మంజూషకు ప్రతిభా పురస్కారం

సెల్ఐటి న్యూస్‌, గన్నవరం: గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్ విద్యార్థిని బండి మంజూష ఏ.పి.జె.అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారానికి ఎంపికైనట్టు ఆ పాఠశాల ప్రాధానోపాధ్యాయులు కొల్లి సత్య జగదీశ్వరావు బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. మంజూషకు పదోతరగతి ఓ.సి.కేటగిరీలో 9.3 పాయింట్స్ లభించడంతో పురస్కారానికి ఎంపికయ్యిందన్నారు. ఈ అవార్డ్ కింద మంజూష ఒక ట్యాబు, రూ.20 వేలు నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని త్వరలో అంద‌జేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బొడ్డు ప్రసాదరావు, పాఠశాల సిబ్బంది తదితరులు మంజూష‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా గోపవరపుగూడెంకు చెందిన మంజూష మాట్లాడుతూ తనకు ఈ అవార్డ్ రావడానికి ప్రోత్సహాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు కె.ఎస్.జగదీశ్వరావు, ఉపాధ్యాయులే కారణమని పేర్కొంటూ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

Just In...