Published On: Fri, Nov 8th, 2019

పరిపాలన కేంద్రంలో “పందులు”

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర రాజధానిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కొలువుదీరే ఎన్టీఆర్ పరిపాలన కేంద్రం పరిస్థితి ఇది. ఓ తల్లి పంది, ఐదు పిల్ల పందుల్ని వెంటేసుకుని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కి వచ్చింది. అక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా కనిపించేసరికి దాని సంతోషం అంతా ఇంతా కాదు. చెత్తను కెలికి కెలికి రచ్చ చేశాయి. స్వచ్ భారత్ అని ఊరు వాడ డప్పు కొట్టే సర్కారు కార్యాలయం వద్ద పరిస్థితి చూసిన వాళ్ళు ముక్కు మూసుకుని పోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఈ చెత్తంతా కాంప్లెక్స్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలదే కావడంతో పరిస్థితి చూసిన అధికారులు కూడా తల తిప్పుకుని వెళ్లిపోతున్నారు.

Just In...