గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ
* సమీక్షలో సిఎస్ నీలం సాహ్ని
సెల్ఐటి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా, ఇతర అంశాల్లో ఇంకా భర్తీకావాల్సి ఉన్న వివిధ కేటగిరీల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, యువజన సంక్షేమం, వ్యవసాయ, మున్సిపల్ పరిపాలన తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భర్తీ కావాల్సి ఉన్న ఉద్యోగాలన్నిటినీ త్వరితగతిన భర్తీ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆమె ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయీతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, యువజన సంక్షేమం మరియు క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, పంచాయితీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన శాఖల కమీషనర్లు గిరిజా శంకర్, జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.