Published On: Wed, Nov 20th, 2019

ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్‌ వెబ్‌సైట్ ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సురేష్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమిషన్ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్లు, ఫీజులను కమిషన్ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. కమిషన్ ఆధ్వర్యంలో ట్యూషన్ ఫీజును డిసెంబర్ నెలాఖరులో నిర్ణయిస్తామని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్‌లో ఫీజులను పూర్తిగా రీఎంబర్స్‌మెంట్ చేస్తామని తెలిపారు.

Just In...