Published On: Wed, Nov 20th, 2019

అబద్దాలు ప్రచారం చేయటంలో అవంతికి బ్లాక్‌ బెల్ట్‌ ఇవొచ్చు

* అయ్యప్ప మాలలోనూ అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు

* ఇండోర్‌ గేమ్స్‌కి, అవుట్‌డోర్‌ గేమ్స్‌కి తేడా తెలియని అవంతి క్రీడాశాఖ మంత్రా?

* ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేయటంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌కు బ్లాక్‌బెల్ట్‌ ఇవ్వొచ్చ‌ని, అయ్యప్ప మాలధార‌ణ‌లో ఉండి కూడా ఆయ‌న అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ మంతెన స‌త్య‌నారాయ‌ణ‌రాజు అన్నారు. ఈ మేర‌కు గుంటూరు తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాల‌యం నుండి మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కుల, మత రాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరు. కానీ  ఆ పార్టీ నేతలు  టీడీపీపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఇంగ్లీష్‌కు టీడీపీ వ్యతిరేకం కాదు. విధ్యార్ధులు తమకు నచ్చిన భాషలో చదుకునేలా ఆప్షన్‌ ఇవ్వాలి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగును కూడా కొనసాగించాలని టీడీపీ కోరడం మత రాజకీయామా?  దీనికి అవంతి శ్రీనివాస్‌ సమాధానం చెప్పాలి. ప్రపంచాన్ని అంతా తానే ఉద్దరిస్తున్నానన్న భ్రమలో అవంతి ఉన్నారు. ఇండోర్‌ గేమ్స్‌కి, ఔట్‌డోర్‌ గేమ్స్‌కి తేడా తెలియని అవంతికి క్రీడా శాఖ ఇవ్వడంతో  పాపం ఏం మాడ్లాడాలో తెలియక రోజూ చంద్రబాబుపై బురద జ‌ల్లుతున్నారు.  అయ్యప్ప మాలలో ఉన్న అవంతి అయ్యప్ప జపం చేయకుండా కల‌లో కూడా భయంతో  చంద్రబాబు జపం చేస్తున్నారు.   క్రీడా శాఖను, పర్యాటక రంగాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారు. అవంతి ఇప్పటికైనా అవాస్తలు మాడ్లాడటం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలి.

Just In...