Published On: Fri, Dec 6th, 2019

శాఖాప‌రంగా ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న తీసుకురావాలి …

* ఉద్యోగుల‌తో ప‌.గో జిల్లా నూత‌న డీటిసి యం.పురేంద్ర

* డీటీసి క‌లిసి అభినందించిన జోన‌ల్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు

* ప్ర‌జ‌ల‌కు శాఖ‌ను మ‌రింత చేరువ చేస్తామ‌ని ఉద్యోగుల త‌ర‌ఫున హామీ ఇచ్చిన జోన‌ల్ అధ్య‌క్షుడు రాజుబాబు

సెల్ఐటి న్యూస్‌: ఏలూరు,  ప‌.గో. జిల్లాలోని ప్రజలకు రవాణా శాఖ ద్వారా అందించే ఆన్‌లైన్ సేవలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ప్రజల నుండి రవాణా శాఖకు మంచి స్పందన వచ్చే విధంగా ఉద్యోగులు పనిచేయాలని డిటీసీ యం.పురేంద్ర కోరారు. ఏలూరులోని స్థానిక డిటీసీ కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు ఆధ్వర్యంలో జోనల్ కార్యవర్గ సభ్యులు పశ్చిమగోదావరి జిల్లా డిటిసిగా పదోన్నతిపై వచ్చి బాధ్య‌త‌లు స్వీకరించిన పురేంద్రను డిటీసీ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా డిటీసీ పురేంద్ర మాట్లాడుతూ జిల్లాలోని కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ద్వారా వాహనదారులు నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని డిటీసీ కోరారు. జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు మాట్లాడుతూ ఆర్టీఓగా ఏలూరు డిటీసీ కార్యాలయంలోనే బాధ్య‌తలు చేపట్టి మరల అదే డిటీసీ కార్యాలయానికి డిటీసీగా పదోన్నతిపై రావడం అరుదైన విషయమని, డిటీసీ పురేంద్రను కొనియాడారు. ఆర్టీఓగా ఉన్నప్పుడు వారితో ఉన్న సంబంధాన్ని ఈ సంద‌ర్భంగా రాజుబాబు గుర్తుచేసుకున్నారు. రాజమండ్రి ఆర్టీవోగా ఉంటూనే పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి డిటిసిగా ఉన్న సమయంలో అటెండర్ నుండి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తూ పురేంద్రకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రవాణాశాఖకు మంచి పేరును తెచ్చేలా ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, ఆ దిశ‌గా ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఉద్యోగుల పక్షాన హామీ ఇచ్చారు. డిటిసి పురేంద్ర‌ను కలిసిన వారిలో జోనల్ సంఘ సభ్యులు జోనల్ కార్యదర్శి పి.విజయ, సహధ్యక్షురాలు ఉషాసుందరి, ఉపాధ్యక్షురాలు అనిత, సంయుక్త కార్యదర్శులు సుకుమార్, నాగమురళి, రాష్ట్ర సంఘ నాయకులు వర్మ, జిల్లా ఈసి మెంబర్ ఎ.డి.ఎస్.నారాయణ, సీనియర్ నాయకులు మాణిక్యాలరావు, ఆనంద నాగభూషణం, కిషోర్, రామకృష్ణమ్మ, ఉద్యోగులు ఉన్నారు.

Just In...