Published On: Sat, Jan 11th, 2020

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి…

* రోడ్డు ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టాలి

* రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం 2020 డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాల లబ్ధిని లబ్దిదారుల‌కు చేరువ చేసేందుకు రవాణాశాఖా టెక్నికల్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య కోరారు. రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం రూపొందించిన 2020 డైరీని శుక్రవారం మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆర్టిసీ కాంప్లెక్స్ పరిపాలనా భవన సముదాయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైయస్ఆర్ వాహనమిత్ర ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రతీ ఏడాది రూ.10 వేలు ఆర్ధిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ, ప్రతి పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతున్నారన్నారు. ఆయన నవరత్నాలు ద్వారా అందించే లబ్ది ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే తమ లక్ష్యమని ఇందుకు రవాణా శాఖాధికారులు, సిబ్బంది వారి వంతు తోడ్పాటును అందించాలన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో టెక్నికల్ అధికారులు నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ అడ్వయిజర్స్ పి.నూకరాజు, డివి.రావు, అసోసియేషన్ అధ్యక్షుడు కెవి సుబ్బారావు, వైస్ ప్రసిడెంట్ పి.సీతాపతిరావు, శివనాగేశ్వరరావు, వాసుదేవరెడ్డి , జనరల్ సెక్రటరి కె.సీతారామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరి డి.యస్.యం.వరప్రసాద్, జాయింట్ సెక్రటరి యస్.వెంకటరావు, ట్రెజ‌రర్ జి.వి.నరసింహారావు, కో-ఆర్డినేటర్లు, సలహాదారులు, సాంకేతిక కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Just In...