Published On: Mon, Jan 13th, 2020

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ..

* విభ‌జ‌న స‌మ‌స్య‌లు, తాజా రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చ‌

హైదరాబాద్, సెల్ఐటి న్యూస్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క‌ల్వ‌క‌ర్తి చంద్ర‌శేఖ‌ర‌రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమ‌వారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా వారిరువురూ తాజా రాజకీయ అంశాలతో పాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు అదితర అంశాలతో పాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, ఇతర పెండింగు అంశాలపైనా చర్చించిన‌ట్లు సమాచారం. ప్రధానంగా విద్యుత్తు ఉద్యోగులు, 5 డిఎస్సీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు పైనా కూడా ఇద్ద‌రు సీఎంలు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. జ‌గ‌న్ వెంట ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా ఉన్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అడుగిడిన వెంట‌నే సీఎం కేసీఆర్ కాళ్ల‌కు విజ‌య‌సాయి రెడ్డి న‌మస్క‌రించుకున్నారు.

 

Just In...