Published On: Sat, Jan 18th, 2020

సముద్రంలో యువకుడు గల్లంతు

శ్రీకాకుళం, సెల్ఐటి న్యూస్ క్రైం: కవిటి మండలం కాపాసుకుద్ది గ్రామానికి చెందిన నావ కృష్ణ (20) మూడు నెలలు క్రితం జీవనోపాధి కోసం గుజరాత్ వెళ్లారు. ఈ క్ర‌మంలో గురువారం నాడు చేపల వేట సముద్రంలో సాగిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో జారి పడ్డంతో గల్లంత‌య్యాడు. స‌మాచారం అందుకున్న తల్లి నావ నూకమ్మ రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...