Published On: Sat, Jan 18th, 2020

ఫిబ్ర‌వ‌రి 1న నిర్భయ దోషులకు ఉరి…

ఢిల్లీ, సెల్ఐటి న్యూస్ క్రైం: నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తెలిపింది. నలుగురు దోషులకు ఫ్రెష్ డెత్ వారెంట్‌ను శుక్ర‌వారం జారీ చేసింది. అంతకు ముందు జనవరి 22న ఉరి వేయాలని తీర్పిచ్చింది ఢిల్లీ కోర్టు. కాని దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ కారణంగా ఆ తేదిన వేయాల్సిన ఉరి తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కొత్త తేదీని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. తీహార్ జైల్లోనే నలుగురు దోషులకు ఉరి ఉంటుందని కోర్టు తెలిపింది.

Just In...