Published On: Sun, Jan 19th, 2020

ఆర్టీసీ బస్సు బోల్తా… 8 మందికి స్వల్ప గాయాలు

పీలేరు, సెల్ఐటి న్యూస్ క్రైం: చిన్నగొట్టిగల్లు మండలం ఎడం వారి పల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 8 మంది కి స్వల్ప గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నుండి మదనపల్లి కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్నగొట్టిగల్లు మండలం గడ్డంవారిపల్లె సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు.

Just In...