Published On: Mon, Jan 20th, 2020

ఆర్త‌జ‌న సేవ‌లో ఆశాజ్యోతిలా స్వ‌చ్ఛంద సేవాసంస్థ‌లు …

* ల‌య‌న్స్ క్ల‌బ్ బెస్ట్ రీజియ‌న్ మీట్‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌జాసేవ‌నే ప‌ర‌మావధిగా కాంక్షిస్తూ సామాజిక బాధ్య‌త‌గా ల‌య‌న్స్ క్ల‌బ్ స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు పేద‌ల‌కు వ‌రంగా మారాయ‌ని, ల‌య‌న్స్ సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు అన్నారు. ది ఇంట‌ర్నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ ల‌య‌న్స్ క్ల‌బ్స్ (316డి రీజిన‌ల్ 5) ఆధ్వ‌ర్యంలో 12 ల‌య‌న్స్ క్ల‌బ్బుల విభాగాలతో క‌లిపి ఆర్టీసీ వ‌ర్క్‌షాప్ రోడ్డులోని ఎస్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించిన ప్రాంతీయ స‌మావేశం (బెస్ట్ రీజియ‌న్ మీట్‌)లో మంత్రి వెలంప‌ల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌కు వ్య‌వ‌సాయ సాగు అవ‌స‌రార్థం సుమారు ల‌క్ష‌న్న‌ర విలువైన వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు, ర‌సాయ‌నిక ఉత్ప‌త్తుల‌ను పంపిణీ చేశారు. ప‌లువురు పేద మ‌హిళ‌ల‌కు ఉపాధి నిమిత్తం ఉచితంగా కుట్టుమిష‌న్లు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ ప్ర‌జా సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ అంద‌రికీ చేరువ చేయ‌డంలో కొంత జాప్యం జ‌రుగుతున్న సంద‌ర్భాల్లో ఆ లోటును ల‌య‌న్స్ క్ల‌బ్ వంటి స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు ముందుకు వ‌స్తూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ల‌య‌న్స్ క్ల‌బ్ కృష్ణా రీజియ‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ఇమ్మ‌డిశెట్టి సురేష్‌బాబు, శిరీష (ల‌య‌న్స్ కృష్ణా రీజియ‌న్ తొలి మ‌హిళ) దంప‌తులు విద్య‌, వైద్యం, పున‌రావాసం వంటి క‌నీస అవ‌స‌రాల‌ను గుర్తించి అనేక సేవా కార్య‌క్ర‌మాలు పేద‌ల‌కు ఎంత‌గానో స్వాంతన క‌ల్గిస్తున్నాయ‌ని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా వారిని అభినందించారు. గౌర‌వ అతిథిగా పాల్గొన్న శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ‌స్వామి మాట్లాడుతూ సామాజిక బాధ్య‌త‌గా ల‌య‌న్స్ క్ల‌బ్బుల‌ సేవ‌లు ప్ర‌జ‌ల వ్య‌య‌ప్ర‌యాస‌లు తీరుస్తూ ఎంత‌గానో తోడ్ప‌డుతున్నాయ‌ని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ జిల్లా ఛైర్‌ప‌ర్స‌న్‌ దేవ‌తి నాగేశ్వ‌ర‌రావు, జిల్లా అద‌న‌పు కార్య‌ద‌ర్శి కొన‌క‌ళ్ల విద్యాధ‌ర‌రావు, టి.వాసుదేవగుప్తా, జిల్లా గ‌వ‌ర్న‌ర్ వై.పి.సి.ప్ర‌సాద్‌, నేత్ర‌జ్యోతి సేవా మ‌హోత్స‌వం ఛైర్మ‌న్ టి.దుర్గామ‌ల్లేశ్వ‌రరావు, డి.జ‌గ‌న్మోహ‌న్‌రావు, వ‌క్క‌ల‌గ‌డ్డ భాస్క‌ర‌రావు, పువ్వాడ శ్రీనివాస‌రావు, ఉమాశంక‌ర్‌, ఎం.రంగ‌నాయ‌కులు, స‌త్య‌నారాయ‌ణ (పెద‌బాబు) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...