Published On: Tue, Jan 21st, 2020

ఏసీబీ వ‌ల‌లో కృష్ణా త‌హ‌శీల్ధార్‌…

* రూ.3 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన వైనం

* కృష్ణా క‌లెక్ట‌రేట్‌లో క‌ల‌క‌లం..

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఏసీబీ వలలో ఆర్థ‌రైజ్డ్ ఆఫీసర్ ల్యాండ్ రిఫార్మ్స్(తహశీల్దారు) దాసరి ప్రశాంతి ప‌ట్టుబ‌డ్డారు. కృష్ణా కలెక్టరేట్‌లో ఫిర్యాదుదారు అయిన మేకా రామలింగేశ్వర రెడ్డి, ఉండవల్లి సెంటర్ ,తాడేపల్లి ,గుంటూరు జిల్లా అనే వ్య‌క్తి నుండి రూ.6ల‌క్ష‌లు అడిగి తొలి విడతగా రూ.3 ల‌క్ష‌లు లంచంగా తీసుకుంటుండ‌గా అధికారులు దాడులు చేసి ప‌ట్టుకున్నారు. మేకా రామ‌లింగేశ్వ‌ర‌రెడ్డికి చెందిన భూములకు సంబంధించి ల్యాండ్ సీలింగ్ చట్టం కింద నోటీసులు ఇవ్వకుండా వారికి అనుకూలంగా చేయుటకు, లంచం అడిగి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Just In...