Published On: Wed, Feb 5th, 2020

క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్…

* తొలి దశలో గుర్తిస్తేనే చికిత్స సులభం

* ఏపీఐఐసీ చైరవర్సస్ ఆర్.కె.రోజా

* వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో .. 3కె వాకథాన్ – పింక్ ర్యాలీ

* మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నైలా

* ఘనంగా ‘నైలా’ ప్రోగ్రాం ఆవిష్కరణ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: క్యాన్సర్ వ్యాధి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సు తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే క్యాన్సర్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజ్ ఇనిస్టిట్యూట్, ఎమో ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన 3కె వాకథాను ఆమె ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడం కోసం నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద మంగళవారం జరిగిన ఈ వాకథాన్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోజాతో పాటు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో అన్నం మల్లిఖార్జున ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం పట్ల మహిళలకు అవగాహన కల్పించడం కోసం ‘నైలా’ పేరిట అమెరికన్ అంకాలజ్ ఇనిస్టిట్యూట్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని రోజా ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మనదేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది మహిళలు క్యాన్సర్ బారినపడుతున్నారని అన్నారు. వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం, ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే సులువుగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు అవగాహన కల్పించడం కోసం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఉద్యమ రూపంలో చేపట్టిన ‘నైలా’ అభినందనీయమని రోజా కొనియాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న అమెరికన్ ఆంకాలజ్ బాటలోనే మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో అన్నం మల్లిఖార్జున మాట్లాడుతూ భారతీయ మహిళలకు సంబంధించి 2018లో 5.8 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 10 శాతం కంటే తక్కువ మందికి వంశపారంపర్యంగా క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తోందని విశ్లేషించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అన్ని వర్గాల వారికి, మరి ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉంటే ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు అవగాహన కల్పించేందుకు అక్టోబరు నాటికి 2020 మంది వాలంటీర్లను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టీఎస్సార్ మూర్తి, ఎస్ఆర్ అకాడమీ ట్రెజరర్ డాక్టర్ అక్కినేని మణి, బొమ్మిడాల క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ డాక్టర్ బయ్య శ్రీనివాసరావు, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ ఎన్. సుబ్బారావు, రీజనల్ డైరక్టర్ మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహిళలకు అవగాహన కల్పించడం కోసం అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ చేపట్టిన మసూద్యమే ‘నైలా’.. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 అక్టోబరు నాటికి 2020 మంది వాలంటీర్లకు శిక్షణనిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు, క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తించేలా మహిళలకు అవగాహన కల్పిస్తారు. నైలా అంటే అరబిక్ భాషలో విన్నర్ అని అర్ధం. క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించడమే లక్ష్యంగా అమెరికన్ ఆంకాలజీ ఆవిష్కరించిన విన్నర్.. నైలా అమెరికన్ ఆంకాలజీ చేపట్టిన ‘నైలా’లో భాగస్వాములవ్వాలనుకునే వారు www.americanoncology.com/nyla/నందు రిజిస్టర్ చేసుకోవచ్చు. 

Just In...