Published On: Fri, Apr 3rd, 2020

నిరంత‌రాయంగా తూనిక‌లు, కొల‌త‌లు శాఖ త‌నిఖీలు..

* నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు

* తూనిక‌లు, కొల‌త‌ల శాఖ నియంత్ర‌ణ అధికారి కాంతారావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: దుకాణాల్లో తూనిక‌లు, కొల‌త‌ల‌కు సంబంధించి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ మెట్రాలజీ శాఖ కంట్రోలర్ డాక్ట‌ర్ యం.కాంతారావు వ్యాపారుల‌ను హెచ్చ‌రించారు. కోవిడ్-19 (కరోనా) వైర‌స్‌పై లాక్‌డౌన్ సంద‌ర్భంగా తూనికలు, కొలతలలో అవకతవకలు జరుగకుండా శాఖాప‌రంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోజువారీ తనిఖీలలో భాగంగా కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం నందు రైతు బజార్లు, జనరల్ స్టోర్స్‌లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ కంట్రోల‌ర్ కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. త‌నిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం రైతు బజార్ల దుకాణాలు, రైతులు ఉపయోగించే తూనిక యంత్రాల యొక్క ఖచ్చితత్వాన్ని మరియు శాఖాప‌రంగా వేయబడిన ముద్రలను తనిఖీ చేశారు. సదరు తనిఖీలలో, లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారం ఎటువంటి ఉల్లంఘనలు జర‌గ‌లేద‌ని గమనించామ‌న్నారు. ఈ సందర్భంగా రైతులు కూరగాయలను విక్రయించే సమయంలో సంబంధిత తూనిక యంత్రము యొక్క రీడింగ్స్ సున్నా (జీరో) స్థాయికి వచ్చిన తర్వతనే తూకం వేయాల‌ని రైతులను ఆదేశించారు. వినియోగదారులు కూడా కూరగాయలు మొదలగు వస్తువులు కొనుగోలు చేయునప్పుడు ఈ విషయాన్ని గమనించాల‌ని కోరారు. అలాగే జనరల్ స్టోర్స్‌లను సందర్శంచి వారు ఉపయోగించే తూనిక యంత్రాల యొక్క ఖచ్చితత్వాన్ని మ‌రియు డిపార్టుమెంటు వారిచే వేయబడిన ముద్రలను తనిఖీ చేశారు. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్ కమోడిటీస్) రూల్స్, 2011 నందు రూల్ 4, 6 నిబంధనల ప్రకారము ప్రతి రిటేల్ ప్యాకేట్ల పైన ముద్రించాల్సిన డిక్లరేషన్స నందు ఈ దిగువ పేర్కొన్నబడినటువంటి అంశములను తప్పనిసరిగా అనుసరించవలససినదిగా ఆదేశించినారు. తయారీదారుని / దిగుమతిదారుని / ప్యాకదారుని పేరు మరియు చిరునామా వస్తువు యొక్క పేరు నికర బరువు, కొలత లేదా నెంబరు. తయారు చేయబడిన తేది (నెల మరియు సంవత్సరం) గరిష్ట అమ్మకపు ధర 6. కస్టమర్ కేర్ యొక్క నెంబరు, చిరునామా, టెలిఫోన్ నెంబరు మరియ ఈ-మెయిల్ అడ్రస్ సదరు తనిఖీలలో, లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము ఎటువంటి ఉల్లంఘన జర‌గ‌లేద‌ని గుర్తించామ‌న్నారు. ఈ సందర్భంగా వినియోగదారులతో కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ నేప‌ధ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తూనికలు, కొలతలలో మోసాలకు పాల్పడే వ్యాపారులు మరియు చౌకధరల దుకాణపు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అలాగే ప్యాకేజ్డ్ పాలు మరియు పాల పదార్దాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్ర‌యించే వాప్యారుల‌పైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తనిఖీల్లో అసిస్టెంట్ కంట్రోలర్-3 వి.వి.నాగరాజారావు, సిబ్బంది పాల్గొన్నారు. తూనికలు, కొలతల విష‌యంలో ఎవ‌రైనా మోసపోయినట్లు భావిస్తే మరియు ప్యాకేజీలపై ముద్రించిన యం.ఆర్.పి. ధరలకన్నా అధికంగా విక్రయిస్తే లీగల్ మెట్రాలజీ శాఖ టోల్ ఫ్రీ నెంబరు 1800-425-4202కు గానీ ఈ మేయిల్ cImcomplaintcell@gmail.com & cIm-ap@nic.in వెబ్ అడ్రస్ www.apIm.gov.in ద్వారా ఫిర్యాదు చేయాల‌ని అధికారులు సూచించారు.

Just In...