Published On: Fri, May 15th, 2020

దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు…

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: కనకదుర్గ అమ్మవారి దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై ఆన్‌లైన్‌లో అమ్మవారి దర్శనం టికెట్లు ఇవ్వనున్నారు. 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. గంటకు 250 మంది భక్తులు మించకుండా దర్శనానికి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణీని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాస్క్‌ ధరించి వచ్చిన భక్తులను మాత్రమే ఘాట్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. అడుగడుగునా ఫుట్‌ ఆపరేటెడ్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులపై హైపో క్లోరైడ్‌ లిక్విడ్‌ను పిచికారీ చేసేలా 30 అడుగుల మేర డిజిన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. దూరం పాటించేలా మార్కింగ్‌ ఇచ్చారు.

Just In...