Published On: Wed, May 20th, 2020

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..

* ఈ నెల 21న ముహూర్తం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో ఈ నెల 21న ఉదయం ఉంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతి ఇస్తున్నట్లు చెప్పింది. దశల వారీగా బస్సులను రెడ్డెక్కించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ వివరించింది.

Just In...