Published On: Wed, May 20th, 2020

అక్రమ మద్యంపై కొరడా…

* భవానీపురం పోలీసుల వేట‌

* 234 మద్యం బాటిల్స్ స్వాధీనం

* 8 మంది నిందితులు అరెస్టు, ప‌లు వాహ‌నాలు సీజ్‌

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: న‌గ‌ర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలపై డీసీపీ విక్రాంత్‌పాటిల్ పర్యవేక్షణలో ప‌శ్చిమ డివిజన్ ఏసీపీ సుధాకర్ నేతృత్వంలో భవానీపురం పోలీస్‌స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి, ఎస్‌.ఐ.లు రవీంద్ర, ఇజ్రాయెల్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. గొల్లపూడి వన్ సెంటర్ నందు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో వివిధ బ్రాండ్లకు చెందిన 234 మద్యం సీసాల‌ను అక్రమంగా రవాణా చేస్తుండగా 8 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసి వారి వాహనాలను సీజ్ చేశారు. అక్రమ పద్దతులలో మద్యం రవాణా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం అని అలాంటి వాటిపై కఠిన మైన కేసులు నమోదు చేస్తామని సీఐ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. మద్యం రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే 99440796489, 0866-2418833 ఫోన్ నంబ‌ర్ల‌కు తెలియచేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామ‌న్నారు. ప్రజలందరూ కూడా లాక్‌డౌన్ సడలింపులు అర్ధం చేసుకొని స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని, బయటకు వచ్చిన సందర్భాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలలో లాక్ డౌన్ సడలింపులు వర్తించవన్నారు.

Just In...