Published On: Thu, May 21st, 2020

ఏపీలో క్రొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం

* మే 31 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల సవరణకు వెబ్‌సైట్ అందుబాటు

* పీడిఎఫ్ ఫార్మాట్‌లో ధృవపత్రాలు అప్‌లోడ్ చేయుటకు మరొక అవకాశం

* డిసెంబర్ తర్వాత మీడియా సంస్థ మారిన పాత్రికేయులు యాజమాన్య సిఫార్సు లేఖతో సహా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది జూన్ 30 నాటికి ముగుస్తున్నందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి, పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.ipr.ap.gov.in ను అందుబాటులో ఉంచడమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడీ ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకొనే అవకాశం కలుగుతుంది. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించని డాక్యుమెంట్లు, సర్టీఫికేట్ లు అప్‌లోడ్ చెయవలసినదిగా కోరడమైనది.  గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలను పీడిఎఫ్ పార్మెట్లో అప్‌లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యూమెంట్లు పూర్తి స్థాయిలో కనబడలేదు కావున, అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన పత్రాలను “పీడీఎఫ్ ఫార్మెట్‌”లో మాత్రమే అప్‌లోడ్ చెసుకోవాల్సి ఉంటుంది. అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యాలు వారి సంస్థల్లో పనిచేయుచున్న పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి రికమండేషన్ లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరి చేసి సవరించిన లేఖలను అప్‌లోడ్ చేయాలన్నారు. కావున, ఇదివరలో అక్రిడిటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు వారి డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వెబ్ సైట్ ను 31.5.2020 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకుని, పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాల్సిందిగా కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి కోరారు.

Just In...