Published On: Fri, May 22nd, 2020

పాకిస్థాన్‌లో విమాన ప్రమాదం… 98 మంది దుర్మరణం?

* కరాచీ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం

క‌రాచీ, జ‌న‌ర‌ల్ డెస్క్‌: కరాచీ విమానాశ్రయం సమీపంలో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాద‌వ‌శాత్తు కుప్ప‌కూలింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. పాకిస్థాన్‌లో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 98 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 91 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది. ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలో కూలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.

Just In...