Published On: Sat, May 23rd, 2020

వైఎస్సార్ వాహనమిత్ర పధకం విజయవంతం…

* రెండో విడత అమలు కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం

* ర‌వాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు

విజ‌య‌వాడ‌, సె‌ల్ఐటి న్యూస్‌: కోవిడ్-19 వ్యాప్తి కార‌ణంగా అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్ నేప‌ధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాహన డ్రైవర్లకు ఐదు నెలలు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా ఆర్థిక సహాయంగా వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రూ.10వేలు అందించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయ‌మ‌ని ర‌వాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు. గతేడాది వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆటో/ టాక్సీ/ మ్యాక్సీ క్యాబ్ సొంతంగా కలిగి నడుపుకుంటున్న 2,36,344 మంది లబ్బిదారులకు గత ఏడాది అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయ్యడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని) వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా లబ్బిదారులకు ఆర్థిక సహాయంగా రూ.10 వేలు అందించాలని నిర్ణహించడం అభినందనీమ‌న్నారు. అది కూడా 5 నెలలు ముందుగానే ఇవ్వాలని నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వర్గాల ప్రజల్లో ఆనందాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర తొలి ఏడాది విజయవంత‌మ‌వ‌డంలో ర‌వాణాశాఖ ఉన్నతాధికారులు చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ముఖ్యంగా ఈ విష‌యంలో ప్రముఖ పాత్ర పోషించిన‌ రాష్ట్ర స్థాయిలో సంయుక్త రవాణా కమీషనర్ ఎల్.ఎస్.యం. రమాశ్రీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని), ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామంజనేయులు చేతుల మీదుగా జ్ఞాపిక‌ను అందించారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రమాశ్రీకి ర‌వాణాశాఖ ఉద్యోగుల తరుపున రాజుబాబు, రవాణా శాఖ సంఘం నాయకులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

 

Just In...