Published On: Sat, May 30th, 2020

ప్ర‌ధాని మోది నాయ‌క‌త్వంలో త్వరలోనే స్వావలంబన భారత్…

* జ‌న‌సేన అధినేత పవన్‌ కళ్యాణ్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్‌ అన్నారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్ది భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, ధైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం కానుందని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‌పేర్కొన్నారు.

Just In...