Published On: Sat, May 30th, 2020

సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం

* ఏపీ అడ్వొకేట్ జనరల్
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: హైకోర్టు తీర్పుతో మళ్లీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టడంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్యణ్య శ్రీరామ్ స్పందించారు. హైకోర్టు తీర్పుపై వివరణ ఇచ్చేందుకు శ‌నివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నామని తెలిపారు. తాము సుప్రీంను ఆశ్రయించే వరకు నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇవ్వాలని హైకోర్టును కోరామని చెప్పారు. ఈ విషయాన్ని పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌లో స్పష్టత కోసం సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు. ఎస్ఈసీగా రమేష్‌కుమార్ నియామకంలోనే చట్టపరమైన ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపించారు.

Just In...