Published On: Mon, Jun 22nd, 2020

ఆహార ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం

* మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమ‌రావ‌తి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం అని రాష్ట్ర ప‌రిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.  వాణిజ్యానికి అయ్యే ఖర్చును మరింత తగ్గించేందుకూ కసరత్తు చేస్తున్నామ‌న్నారు. ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయ‌ని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలో ఏపీ కీలకం అన్నారు. పండ్లు, పాలు, కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు, చిరు, తృణధాన్యాల భాండాగారం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 8 వేలకు పైగా ఆహార శుద్ధి పరిశ్రమలకు నెలవు అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ పరిశ్రమలకు కొదవ లేదు అని తెలిపారు. పారదర్శకంగా తక్కువ సమయంలోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతున్నాయ‌న్నారు. ఆహార ఉత్పత్తికి రైతాంగానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాం అన్నారు. అన్నదాతలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పంటలను కాపాడుకోవడానికి శీతల కేంద్రాలు, ఎగుమతి కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వసతులు కల్పించాం అన్నారు. ‘ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్ట్‌మెట్ ఫోరమ్స‌ వెబ్‌నార్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్ల‌డించారు.

Just In...