Published On: Wed, Jul 8th, 2020

రూ.190 కోట్ల అభివృద్ధి ప‌నులకు సీఎం జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

వైఎస్ఆర్ జిల్లా, సెల్ఐటి న్యూస్‌: వైఎస్ఆర్ జిల్లా ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ఆవిష్క‌రించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇందులో.. ఆర్‌జియుకెటి, ఆర్‌కె వ్యాలీలో  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన  క్రొత్త ఎకడెమిక్ కాంప్లెక్స్ ఆవిష్కరణ. దీనిని ఎన్‌బిసిసి (ఐ) లిమిటెడ్ రెండు దశల్లో అమలు చేస్తోంది. ప్రస్తుతం మొదటి దశలో నిర్మాణం పూర్తి చేసిన 7 ECE, CSE, MME, EEE, కెమికల్, మెకానికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగ భవనాలు ఉన్నాయి. మరియు ఇందులో 4 సాధారణ భవనాలు. సెంట్రల్ లైబ్రరీ, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, క్యాంటీన్ మరియు లాండ్రీ ఉంటాయి. రెండవ దశలో బాహ్య సేవల కల్పన ఉంటుంది. ఇందులో రోడ్లు, 475 కెఎల్‌డి మురుగునీటి శుద్ధి కర్మాగారం, 11 కెవి సబ్‌స్టేషన్, 75 కిలోవాట్ల సోలార్ పివి వ్యవస్థ, నీరు ట్రీట్మెంట్ ప్లాంట్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మరియు హార్టికల్చర్ పనులు ఉంటాయి. రూ.10.10 కోట్ల అంచనాతో కంప్యూటర్ సెంటర్ కు సిఎం శంఖుస్థాపన చేశారు. ఇందులో  నాలుగు కంప్యూటర్ ల్యాబ్‌లు మరియు రెండు లెక్చర్ హాల్‌లు ఉంటాయి. 616 మంది కూర్చునే సామర్థ్యంతో మొత్తం 22150 చదరపు అడుగుల ప్లిన్త్ వైశాల్యంలో (0.75 ఎకరాలలో) విశాలమైన ప్రాంతంలో  ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ సెంటర్ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. రూ. 40 కోట్లు అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డా. వైయస్ఆర్ ఆడిటోరియం నకు శంకుస్థాపన. ఇది రెండు అంతస్థుల ప్రపంచ స్థాయి ఆడిటోరియం. 1700 మంది విద్యార్థులు  సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.  6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం ప్లిన్త్ ఏరియా 75881.00 చదరపు అడుగులలో దీనిని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు M / s. వెన్సర్ కన్స్ట్రక్షన్స్ భాగస్వామ్యంలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం. ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన ఒక మెగావాట్ల సామర్థ్యం గల మూడు సౌర విద్యుత్ ప్లాంట్లను రెస్కో మోడ్ లో నెట్ మీటరింగ్ పథకం కింద ఏర్పాటు చేశారు. NREDCAP మరియు M / s. వర్షిని ఎక్సిమ్ ప్రై. లిమిటెడ్ దీని నిర్మాణం చేపట్టారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా సున్నా పెట్టుబడితో  RGUKT, RK వ్యాలీలో యూనిట్కు 7.66 రూపాయల నుండి రూ.3.45 కోట్ల వ‌ర‌కు ఖర్చు తగ్గించబడుతుంది. తద్వారా సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చుని ఆదా చేస్తుంది.

Just In...