Published On: Fri, Jul 31st, 2020

వికేంద్రీకరణ బిల్లుల ఆమోదాన్ని నిరసిస్తున్న కాంగ్రెస్

* బీజేపీ, జగన్ ఒక్కటే

* ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్  ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ బిల్లులపై ఇప్పటికే హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, మండలిలో సెలక్ట్ కమిటీకి వెళ్ళడంతో ఏవిధంగా గవర్నర్ ఆమోదించారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంద‌న్నారు. తెలుసుకునే హక్కు రాష్ర్ట ప్రజలకు ఉందన్నారు. బీజేపీ, జగన్ రెండూ ఒకటేనన్నారు. జగన్‌కు బిజేపీతో స్నేహం ఎంత గట్టితో తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామన్నారు. రాజకీయ అవసరాల కోసం బయటకు తియ్యగా మాట్లాడుతూ వ్యతిరేకంగా కవిపిస్తారన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పరం కలిసే ఉంటారన్నారు. సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులు ఆమోదం నాటి నుంచి వారి స్నేహబంధం ధృడమైందన్నారు. ప్రజాస్వామ్యానికి,రాజ్యాంగానికి వ్యతిరేక వ్యవహారాలలో కలిసి పని చేస్తారన్నారు. ఈ బిల్లుల ఆమోదంతో అమరావతి రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మండలిలో ఉమ్మారెడ్డి రాజధాని మారదని ప్రకటించారు. జగన్ ప్రతిపక్షనాయకుడిగా అసెంబ్లీలో 33వేల ఏకరాలు రాజధానికి కావాలని ప్రకటించలేదా అని ప్రశ్నించారు. జగన్ తీసుకునే విధానం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలులోనే ఉందన్నారు. కేంద్రం మెడలు వంచి అవి సాధిస్తేనే సాధ్యమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంద‌న్నారు.

Just In...