Published On: Sat, Aug 8th, 2020

కరోనా మరణాలను నియంత్రించడమే అంతిమ లక్ష్యం

* పాజిటీవ్ వ‌చ్చిన వ్యక్తుల‌ను ఆసుపత్రుల్లో అడ్మిషన్లలో జాప్యం వద్దు

* జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: క‌రోనా మరణాలు తగ్గించడమే అంతిమ లక్ష్యంగా మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులు, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కోవిడ్ సేవలు అందస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు, వైద్యాధికారులు, ఆసుపత్రిలో నోడల్ అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్షించారు ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా సోకిన రోగులను అడ్మిట్
చేసుకొని చికిత్స అందించడంలో ప్రైవేట్ హాస్పటల్స్ ముందుకు రావాలన్నారు. కరోనా టెస్టులు నిర్వహించడంతో పాటు గుర్తించిన పాజిటివ్ కేసులను యుద్ధ ప్రాతిపదిక ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం, కరోనా మరణాల ఆడిట్ రిపోర్ట్ నిర్వహించడం ద్వారా కరోనా మరణాలు నియంత్రించవచ్చన్నారు. కరోనా వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యంగా జీజీహెచ్ తదితర ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లో పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రిలో భర్తీ అయిన పడకలు, ఖాళీ ఉన్న పడకల వివరాలను కచ్చితంగా డిస్‌ప్లే  చేయాలన్నారు.
పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే సంబంధిత వైద్యాధికారి కూడా సందేశం చేరుతుందని ఆపిమ్మట కరోనా పోకెన వ్యక్తి ఆసుపత్రిలో జాయిన్ చేసే సమయం 3, 4 గంటలకు మించి ఉండకూడదన్నారు. కరోనా పోకిన వ్యక్తులను ఆయా ఆసుపత్రుల్లో బెడ్ కేటాయింపుకు లిస్టింగ్ టీమ్, నోడల్ అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలన్నారు. అదేవిధంగా విజయవాడ జిజిహెచ్ పిన్నమనేని, నిమ్రా ఆసుపత్రుల్లో మరిన్ని పడకల స్థాయి సామర్థ్యం పెంచేందుకు మరింత మంది విద్యుత్, స్టాఫ్ నర్సులు తదితర సిబ్బందిని అందించనున్నట్లు చెప్పారు. ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకోవడం లేదని అదే విధంగా కొనసాగితే అటువంటి హాస్పిటల్స్ చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కరోనా వైద్యం పొందిన రోగులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని వెంటనే సమర్పిస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తక్షణమే బిల్లులు చెల్లింపుకు చర్యలు  సుకుంటుందని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా బిల్లులు సకాలంలో అందించి పేమెంట్ పొందాలన్నారు.
అదేవిధంగా పాజిటివ్ నుండి కోలుకుని నెగిటివ్ వచ్చిన వ్యక్తులను డిశ్చార్జ్ చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు కోలుకున్న రోగులు అన్నివిధాలుగా ఆరోగ్యం బాగున్న కోవిడ్ కేర్ సెంటర్లకు మార్చే ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులకు సూచించారు. లిబర్టీ, రమేష్ తదితర ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ పరంగా కేటాయించిన బెడ్‌ల‌లో షిప్టింగ్ కమిటీ తాము సూచించిన విధానంలో పేషెంట్లను అడ్మిట్ చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, జాయింట్ కలెక్టర్ సంక్షేమం) కె.మోహన్‌కుమార్, డిఎంఅండ్ హెచ్ ఓ డి. ఐ.రమేష్, డిప్యూట్ డిఎంఅండ్ హెచ్ ఓ డా.మోతిబాబు డిసి హెచ్.ఎస్.డా.జ్యోతిర్మణి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.సంతోష్, డా.చైతన్యకృష్ణ, జేజి హెచ్ వైద్యాధికారి రత్నావళి, ఆసుపత్రి నోడల్ అధికారులైన మెప్మా పీడి డా.ప్రకాశరావు, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసరావు, సోషల్ వెల్ఫేర్ డి.డి. సరస్వతి, పశుసంవర్ధక శాఖ డిడి విద్యాసాగర్. ఐసిడిఎస్ పిడి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Just In...