Published On: Sat, Aug 8th, 2020

అశోక్ లేలాండ్ ఎవిటిఆర్ ట్రక్కులు ఆవిష్కరణ

* ఐ.జెన్, బిఎస్-6 టెక్నాలజీతో కూడిన వాహనాలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికపుడు నూతన వాహణాలను ఆవిష్కరించే అశోక్ లేలాండ్ నూతన టెక్నాలజీతో “ఏవిటిఆర్ శ్రేణి’ ట్రక్కులను విజయవాడ అశోక్ లేలాండ్ డీలర్ షిప్ నందు ఆవిష్కరించారు. ట్రక్కులను అశోక్ లేలాండ్ సీవోవో అనూజ్ కతూరియా వినియోగదారులకు అందచేశారు. ఐ-జెన్ 6 బిఎస్-4 టెక్నాలజీతో ఎవిటిఆర్ అనే కొత్త శ్రేణి మాడ్యులర్ ట్రక్కులను విజయవాడ స‌మీపంలోని ఎనికేపాడులో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. వాణిజ్య వాహణాల తయారీదారుగా ఉన్న అశోక్ లేలాండ్ ఎవిటిఆర్ ట్రక్ శ్రేణి మాడ్యులర్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఇది యాక్సిల్ కాన్ఫిగరేషన్లు, లోడింగ్ స్పాన్లు, క్యాబిన్లు, సస్పెన్షన్లు, డ్రైవ్ ట్రెయిన్ యొక్క బహుళ ఎంపికలను ఒకే ఫ్లాట్ ఫారమ్ లపై ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్ల కోసం అందిస్తుందన్నారు. ఈ వాహనం కెపాసిటీ 18.5టి నుండి 55టి కేటగిరిలో రూపొందించినట్లు తెలిపారు. మాడ్యులర్ వాహనం డ్రైవర్లకు మెరుగైన భద్రత, మెరుగైన సౌకర్యాన్ని, అధిక విశ్వసనీయత, మెరుగైన మన్నికను అందిస్తుందన్నారు. ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ అశోక్ లేలాండ్ వాహణాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని వాణిజ్య వాహనాలలో అగ్రగామిగా ఉందని తెలిపారు. వాహనాలను దేశ వ్యాప్తంగా అన్ని డీలర్షిప్‌లలో ఆవిష్కరించామని స్పేర్ట్స్ అని ఖచ్చితమైన సంస్థల ద్వారా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు, వాహనదారులు పాల్గొన్నారు.

 

Just In...