Published On: Sun, Aug 9th, 2020

గిరిపుత్రులకు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం

* ఆదివాసీ దినోత్సవం అంటే సంస్కృతి సంప్ర‌దాయ‌ల పండుగ‌

* జ‌గ‌నన్న ప్ర‌భుత్వంలో అదివాసిల‌కు ప్ర‌తిరోజు పండుగే విజ‌య‌వాడ‌,

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: గిరిపుత్రులకు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని, ఆదివాసీ దినోత్సవం అంటే సంస్కృతి సంప్ర‌దాయ‌ల పండుగ అని, జ‌గ‌నన్న ప్ర‌భుత్వంలో అదివాసిల‌కు ప్ర‌తిరోజు పండుగేన‌ని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. ప్ర‌పంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తుమ్మ‌లప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఆదివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌నివాస‌రావు ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్ర‌సంగించారు. అనంత‌రం  పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ లో  జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గోన్ని  గిరిజనులకు చీరలు,పండ్లు  పంపిణి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గిరిజనులను కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా, గిరిజనులకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన మహిళకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల విషయంలో ఎస్సీ, బీసీలతో పాటుగా ఎస్టీలకు కూడా 50శాతం రిజర్వేషన్ కల్పించారు. ఏజెన్సీ ఏరియాలో గ్రామాల్లో వాలంటీర్ల పోస్టులు 100శాతం ఎస్టీలకే ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే గిరిజన శాసన సభ్యులతో టీఏసీని ఏర్పాటు చేసారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ మన్యం గిరిజనుల అభీష్టానికి విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను ఇస్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి వాటిని పూర్తిగా రద్దు చేసి  ఆదివాసీలకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వైఎస్సా‌ఆర్‌సీపి అధికారంలోకి వస్తే గిరిజనుల అభివృద్ధి కోసం ఏ పథకాలను ప్రవేశపెడతామని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా  తూచా తప్పకుండా తొలి ఏడాది కాలంలోనే పూర్తిగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిది.
పారదర్శకంగా ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో  హామీ ఇచ్చారు. దాని ప్రకారంగానే 2019-20 ఆర్థిక సంవత్సరంలో గిరిజనాభివృద్ధి కోసం 48 ప్రభుత్వ శాఖల ద్వారా రూ.4988 కోట్లను మంజూరు చేసి అందులో రూ.3726 కోట్లను 292 పథకాల కోసం ఖర్చు చేసారు. మా ప్రభుత్వం తొలి ఏడాదిలో వైయస్సార్ రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ విదేశీ విద్యాదీవెన తదితర 15 ప్రభుత్వ పథకాల ద్వారా గత మే నెలాఖరు నాటికి మొత్తం 18లక్షలా 40 వేల మంది గిరిజనుల ఖాతాల్లో రూ.2,136 కోట్లను జమ చేయడం జరిగిందన్నారు.

Just In...