Published On: Tue, Aug 11th, 2020

రాష్ట్రంలో అంద‌రికీ ప‌రీక్ష‌లు చేస్తున్నాం

* ప్ర‌ధాని మోదీతో వీసీలో సీఎం జ‌గ‌న్

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ 25 ల‌క్ష‌ల‌కు పైగా ప‌రీక్ష‌లు పూర్తిచేసిన‌ట్లు ఏపీ సీఎం వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డికి వివ‌రించారు‌. మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయస్‌ జగన్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచంలో కోవిడ్‌ ఒక సవాల్‌గా నిల్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 25,34,304 కు పైగా పరీక్షలు చేయగా, 2.35 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రతి 10 లక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేశాం. రాష్ట్రంలో మరణాలు రేటు 0.89 శాతంగా ఉంది. క్లస్టర్లలో పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్నాం, దానిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాం. క్లస్టర్లలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వీలైనంత త్వరగా కేసులు గుర్తించవచ్చని భావించాం. ఆ విధంగా సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నాం. అలా పాజిటివ్‌ కేసులను గుర్తించి, చికిత్స అందించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చు. పాజిటివ్‌గా గుర్తించిన కేసులకు వేగంగా చికిత్స చేయడంతో పాటు, వైరస్‌ వ్యాప్తిని కూడా అరికట్టే లక్ష్యంతో క్లస్టర్లలోనే పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నాం. కరోనాపై ఒక వైపు ప్రజల్లో నెలకొన్న భయాందోళన తగ్గించడంతో పాటు, మరోవైపు అన్ని ఆస్పత్రులలో మౌలిక వసతులను గణనీయంగా పెంచాం. ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు గుర్తించినప్పుడు, ఆ శాంపిల్స్‌ను పూణెలోని ల్యాబ్‌కు పంపించాం. రాష్ట్రంలో అప్పుడు కనీసం వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదు. ఆ తర్వాత పరిస్థితులను పూర్తిగా మార్చివేశాము. రాష్ట్రంలో కనీసం ఒక్క వైరాలజీ ల్యాబ్‌ కూడా లేని స్థితి నుంచి, ఇవాళ ప్రతి 10 లక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేసే స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం.
ఇవాళ మొత్తం 13 జిల్లాలలో కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే కోవిడ్‌కు చికిత్స అందించేందుకు అన్ని జిల్లాలలో పూర్తి సదుపాయాలు ఉన్నాయి. వైరస్‌ ఏ స్థాయిలో సోకినా చికిత్స అందించగలుగుతున్నాం. కోవిడ్‌ టెస్టుల విషయంలో పూర్తి స్వావలంబన సాధించాం. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, వైరస్‌ సోకిన వారిని వేగంగా గుర్తించడం, ఆ తర్వాత వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా గుర్తించడం, తగిన వైద్య సదుపాయాలు కల్పించడంలో, క్షేత్ర స్థాయిలో 2 లక్షల మంది కీలకపాత్ర పోషించారు. వారంతా కోవిడ్‌ నివారణ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు, అందువల్లనే అవసరం అయిన వారందరికీ టెస్టులు చేస్తున్నాం. వీటన్నింటి వల్లనే రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటను 0.90 శాతం కంటే తక్కువకే పరిమితం చేయగలిగాం.
ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఏ ఒక్కరు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదు. అదే విధంగా కోవిడ్‌ పరీక్ష అవసరమైన వారికి ఎక్కడా నిరాకరించొద్దు.. అన్నదే మా లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 100 కు పైగా మొబైల్‌ యూనిట్ల ద్వారా 1500 కు పైగా కేంద్రాలలో శాంపిల్స్‌ సేకరిస్తున్నాం. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలతో సహా, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పరీక్షల సంఖ్య 70 వేలు కూడా దాటింది. ప్రస్తుతం రోజుకు సగటున 60 వేల పరీక్షలు చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో సైతం  పరీక్షలు నిర్వహించి కోవిడ్ కేసులను గుర్తించే  ప్రక్రియ చేపట్టాం. ఆ విధంగా కేసులను గుర్తించిన తర్వాత, వాటి తీవ్రతను బట్టి, వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచడం, లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించడం లేదా కోవిడ్‌ ఆస్పత్రిలో చేర్పించడం చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రోజూ 9 వేల నుంచి 10 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వాటిలో 85 నుంచి 90 శాతం కేసులు క్లస్టర్ల నుంచే నమోదవుతున్నాయి.
రాష్ట్ర స్థాయిలో సగటు తీసుకుంటే, ఆ సంఖ్య తగ్గే వీలుంది. కానీ వీలైనంత వేగంగా పాజిటివ్‌ కేసు గుర్తించి, చికిత్స అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.  కాబట్టి, క్లస్టర్లలోనే పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం 138 ప్రభుత్వ, ప్రై వేటు స్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాం. ఆ విధంగా వికేంద్రీకరించి వైద్య సేవలు అందిస్తున్నాం.
– ఆ 138 కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రులలో మొత్తం 37,189 బెడ్లు ఉన్నాయి. దే విధంగా మైల్డ్‌ కోవిడ్‌ ఉన్న వారి కోసం మరో 109 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను గుర్తించాము. వాటిలో కూడా 56 వేలకు పైగా బెడ్లు ఉన్నాయి. దే సమయంలో ఆక్సీజన్‌ బెడ్లు కూడా గణనీయంగా పెంచాం. కోవిడ్‌ రాక ముందు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం 3286 ఆక్సీజన్‌ బెడ్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 వేలకు పైగా ఆక్సీజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా ఆక్సీజన్‌ బెడ్లు సమకూర్చుకున్నాం. రాష్ట్రంలోని మొత్తం 138 కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రులలో వైద్య నిపుణులు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది మొత్తం 32 వేల మంది వైద్య సేవల్లో పాల్గొంటున్నారు. అలాగే రోగులకు సహాయ పడేందుకు రోజంతా పని చేసే కాల్‌ సెంటర్లతో హెల్ప్‌ డెస్కులు కూడా ఏర్పాటు చేశాం.  విధంగా కేవలం అరగంటలో బెడ్‌ కేటాయించే విధంగా చర్యలు చేపట్టాం. రోగులను త్వరగా అడ్మిట్‌ చేయించడానికి హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది సహాయ పడుతున్నారు.
రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల కోసం ఒకేసారి 1088 అంబులెన్సులు ప్రవేశపెట్టాం. ఈ సమయంలో మీరు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్‌–1 నగరాలు లేవు. ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్నఆస్పత్రులూ లేవు. అందువల్ల రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం అంటూ సీఎం జగన్‌ ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...