Published On: Tue, Aug 11th, 2020

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

* భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాం‌మాధవ్

* 2024లో అధికారం కైవసం చేసుకుంటాం

* భాజ‌పా నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసి రాబోయే నాలుగేళ్లలో బలమైన శక్తిగా ఎదగాలని 2024 ఎన్నికల్లో గెలుపు గట్టిగా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ రాష్ట్ర భాజపా నాయకత్వానికి సూచించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవాడలోని వేదిక హాలులో వర్చువల్ పద్ధతిలో మంగళవారం ఉదయం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాంమాధవ్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. ప్రజల కోసం పోరాటాలు చేసి పార్టీని పటిష్టపరచాలని, రాష్ట్రంలో ప్రతిపక్షస్తానం ఖాళీగా ఉందని, దాన్ని భర్తీచేయడం ద్వారా అధికారం చేపట్టేదిశగా మార్గం సుగమం చేసుకోవాలని సూచించారు. దేశ ప్రధాన ప్రతిపక్షానికి ఏడాది అధ్యక్షుడు లేడు. అధ్యక్షుడు ఎవరౌతారో కూడా నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షాలున్నాయి. భాజపాలో సమానమైన రీతిలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అధ్యక్షులు నియమితులౌతారు. ఇలాంటి విలక్షణ రాజకీయ సంస్కృతి మనది. ఈ పదవి మనకో బాధ్యత. కష్టపడి పనిచేస్తూ, మరో బాధ్యత అప్పగిస్తే దానిని నిర్వహించుకుంటూ వెళ్లడం మన విధి. ఇప్పటి వరకు అమిత్ షా తప్ప ఎవరూ రెండోసారి అధ్యక్షుడు ఎన్నిక అవ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు బాధ్యత వహించడం అనేది ఆలోచించాల్సిన విషయం కాదు. కన్నా లక్ష్మీనారాయణకు రాబోయే రోజుల్లో పార్టీ మరో బాధ్యత అప్పగించవచ్చు. అందరూ సమిష్టి నాయకత్వంతో పనిచేయాలి. ఇందులో మొదటి స్థానంలో అధ్యక్షులుంటారు. సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ పనిచేస్తుంది. భాజపా సంస్థాగతమైన పార్టీ కొన్ని పార్టీలు కుటుంబాలపై అధికార పడతాయి. భాజపా సిద్ధాంతపరంగా కాక సంస్థాగత వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే లక్ష్యంతో మనం పనిచేయాలి. మన రాజకీయాలు వంశపారంపర్యం, స్వార్ధ రాజకీయాలు, పదవీ రాజకీయాల కోసం కాదు. ప్రజల సేవకోసం చేసేవి. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనేది ఆలోచించాలి. 2024లో అధికారం కోసం గట్టిగా పనిచేయాలి. ప్రతిపక్ష స్థానం రాష్ట్రంలో ఖాళీగా ఉంది. భాజపా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా క్రిటికల్ ఫ్రెండ్‌గా పనిచేయాలి. రాబోయే 4ఏళ్లలో బలమైన శక్తిగా ఎదగాలి. మోదీ ఆరేళ్ల విజయాలు సదా ప్రజలకు గుర్తుచేయాలి. గత, ఈ ప్రభుత్వం అమలుచేసే ప్రజాహిత కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా అధికం. మోదీ భుజాలపై తుపాకి గోపి యుద్ధం చేద్దామంటే కుదరదు. కేంద్రం మొత్తం దేశాన్ని చూసే వ్యవస్తగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. మూడు రాజధానులను నిర్మిస్తామని రాష్ట్రం చెబుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అదొక రాజ్యాంగపరమైన సమాధానం మాత్రమే. 2014 తర్వాత హైదరాబాదు నుంచి పాలిస్తూ ఇక్కడ రాజధాని కట్టుకోమంటే ఏ కారణాల వల్ల హైదరాబాద్ ను వదలి ఇక్కడ పరిగెత్తుకొచ్చారో మనకు తెలుసు. ఇక్కడ అద్దె ఇళ్లలో కార్యాలయాలు, బస్సుల్లో సచివాలయం నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందా? అమరావతిని రాజధానిగా చేసుకుంటామంటే కేంద్రం వద్దందా?. రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయం కూడా చేసింది. గత ప్రభుత్వ నిర్ణయం కేంద్రం గౌరవించలేదా? రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం పాత్ర పరిమితంగా ఉంటుంది. కాని ప్రపంచంలో ఏ దేశంలో లేనట్లు మూడు రాజధానులు కడతామన్న ఔచిత్యాన్ని ప్రశ్నించకూడదంటే ఎలా కుదురుతుంది? ఎపీ కంటే 3 రెట్లు అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు ఒకే రాజధాని లేదా? అది సక్రమంగా సాగడం లేదా? ఒక రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, మూడు రాజధానులు కడతామంటే ఒకదాని అవినీతిపై పోరాడినట్లు మూడు రాజధానుల అవినీతిపైన భాజపా పోరాడుతుంది మూడు రాజధానులు త్రిపుల్ కరెప్షన్ సాధనంగా మారకూడదు. అమరావతి రైతులకు న్యాయం జరిగే పోరాటంలో భాజపా ముందుండాలి. రాజధాని అంశం కోర్టులో ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులు అవినీతికి, ఆలవాలంగా మారకుండా, రైతులు నష్టపోకుండా ఉండేలా భాజపా పోరాడాలి రాష్ట్ర అంశాలపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదగాలి. మోదీ మరో 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటారు. ఆ ఫలం మనకు లభిస్తుంది. కాని రాష్ట్రంలో 2024 లో అధికారంలోకి రావడానికి మనం బాగా కష్టపడి, ప్రతిపక్ష పార్టీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న అరాచకం, గుండాయిజం మాకు తెలుసు. రాజకీయాలు పూలపాన్పుకాదు. వారి అధికార దుర్వినియోగంపై మనం సంఘర్షణ చేయాలి జూనియర్ పార్టనర్ మనస్తత్వం వదులుకుని డామినెంట్ పార్టీగా ఎదగాలి. వీధుల్లో నిలబడి పోరాడితేనే మనం నిలబడగలం. ప్రజల కోసం నిలబడే వ్యక్తుల్ని ఆకర్షించాలి. కులరహిత సమాజానికి పాటుపడాలి కొత్త కార్యవర్గం ఎన్నికయ్యాక, సంస్తాగత కార్యక్రమాలు వేగంగా నిర్వహించాలి. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీలో పెద్ద సంఖ్యలో చేర్పులు జరిగాయి. రాష్ట్రం అంతా తిరిగి బలమైన నాయకుల్ని పార్టీలోకి సమీకరించారు. 2024లో అధికారమే లక్ష్యంగా పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగి రాష్ట్రంలో 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా, జనసేన కూటమి పోరాడుతుందని భాజపా రాష్ట్ర అధక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. తెదేపా, వైఎస్ఆర్‌సీపీ రెండూ తమకు ఒకటే అని అన్నారు. ప్రజల కోసం భాజపా పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు దగ్గరచేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసి 2024లో అధికారం కైవసం చేసుకుంటామని అన్నారు. ఏపీకి భాజపా వాణి, బాణి అవసరమైన ప్రక్రియ. గత ప్రస్తుత రాజకీయాలకు చమరగీతమే భాజపా తత్త్వం. రాష్ట్రానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ భాజపా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవి కుటుంబ పార్టీలు. జాతీయవాదం ఈ రాష్ట్రానికి అవసరం. మంచిపాలన ఇవ్వాలనేది భాజపా లక్ష్యం. వాజ్పేయి నుంచి మోదీ వరకు ఇస్తున్న సందేశం అదే. అదే సందేశాన్ని భాజపా, జనసేన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తాయి. భాజపా మానవనరులను సద్వినియోగం చేసుకుంటూ దేశంలో ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాష్ట్రం. తెలుగువారి ప్రతిభా, పాటవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిపుణులను ఉపయోగించుకోవాలనేది భాజపా లక్ష్యం. ఆ లక్ష్యం సాధించేందుకు భాజపా అధికారం చేపట్టాలి. ఇలా చెప్పడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాయి. మన లక్ష్యం, సంకల్పం అంత్యోదయ. దేశంలో చిట్టచివరి పేదవారికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. కులం, మతం చూడకుండా రాష్ట్రానికి 2 కోట్ల ఎల్ ఈడీ బల్బులిచ్చారు. 24 గంటల కరెంటు ఇచ్చారు. అందరి జీవితాల్లో వెలుగును పంచారు. జన్ధన్ ఖాతా ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం చేతారు లో భాజపా, జనసేన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పయనిస్తాం. రాజకీయ పార్టీలు తమ కుటుంబాల కోసం అధికారంలోకి రావాలనుకుంటాయి. కానీ భాజపా మాత్రం ఎవరో ముఖ్యమంత్రికావాలని కాక నిజమైన అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాయి. ఇదే ఆలోచన, లక్ష్యంతో మనం ముందుకెళ్తాం అసెంబ్లీ, 25 పార్లమెంటు, 45 వేల పోలింగ్ బూత్ల కోసం సజీవ వ్యవస్థను నిర్మిస్తాం ఈ పోలింగ్ బూత్లు, మండల కమిటీల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అందరికీ తెలియచేయాలి ఐసీడీఎస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు
కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది. ప్రతి అసెంబ్లీ పరిధిలో 200 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. గత, ఇప్పటి ప్రభుత్వం గర్భిణీలకు 60 గ్రాముల కోడిగుడ్డును ఇవ్వలేకపోయాయి. పరిపాలన అద్భుతంగా చేస్తామన్న నాయకులు 60 గ్రాములు కోడిగుడ్డును ఇవ్వలేకపోయారు. ఇదేం కష్టం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఇవి అందాలి. కోటి మందికి రూ.5 కోడి గుడ్డు, గర్భిణీలకు పాలు అందించాలి. నిజమైన రాజకీయ ఆలోచన చేయాలి. ప్రజలకు అవసరమైన అంశాలను వెలికి తీసి వారికి ఉపయోగపడేలా అధికార, ప్రతిపక్ష పార్టీ కృషి చేయాలి. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాము అందించిన లబ్దిని ఘనంగా ప్రచారం చేసుకున్నాయి? ఇది నిజమా? నిజమైన కార్యక్రమాలా? గతంలో పనిచేసిన ఒక హెూంమంత్రికి కానిస్టేబుల్ ను కూడా బదిలీ చేసే అధికారం లేదు. ఇప్పటి ఎస్సీ వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి, రాష్ట్రంలో ఎస్సీలకు గుండు గొరిగిస్తున్నా ఏం చేయలేని స్తితిలో ఉన్నార‌ని విమ‌ర్శించారు. పూర్వ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాజపాకు నూతన అధ్యక్షుడు నియమితులైన సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలపడటానికి ఇన్నాళ్లూ తనకు సహకరించి, సూచనలు చేసిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీ కాలంలో ఎవరికైనా కష్టం కలిగితే అది పార్టీ బలోపేతానికి చేసిన ప్రయత్నం తప్ప వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదని అంటూ క్షమాపణ చెప్పారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ కేంద్రమంత్రి, మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరించారు. వేదికపై భాజపా జాతీయ సహ సంఘటనా మంత్రి సతీష్ జీ, రాష్ట్ర సంఘటనా సహ కార్యదర్శి సునిల్ డియోధర్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఎమ్మెల్యే పి.వి.ఎస్.మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు
ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, గాల్వామాలో బలిదానం చేసిన భారత సైనికులు, కేరళలో విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మరణించిన కోవిద్ బాధితులకు నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. భాజపా రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్, పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

     

Just In...