Published On: Wed, Aug 12th, 2020

రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తికి స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టండి

* ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష

* ప్రాజెక్టుల నిర్మాణంపై కోవిడ్‌ ప్రభావం చూపిందన్న అధికారులు

* ఇప్పుడు పనులు వేగంగా పుంజుకుంటున్నాయని వివరణ

* వరద సమయంలోనూ పోలవరం పనులు చేసుకునేందుకు ప్రణాళిక

*  నెలకు కొంత మొత్తాన్ని కేటాయించాల‌ని అధికారుల‌కు సూచ‌న‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌ –2, పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్‌–1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్ట్‌ –2లో స్టేట్‌ –2 పనుల ప్రగతిని సమగ్రంగా సమీక్షించిన సీఎం వైయస్ జగన్‌. అక్టోబరు నాటికి అవుకు టన్నెల్‌–2 పూర్తి చేస్తున్నామన్న అధికారులు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటచేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామన్న అధికారులు. అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందన్న అధికారుల‌తో విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ. 500 కోట్లు ఖర్చుపెడితే.. ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్న సీఎం. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే.. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయన్న సీఎం పూల
సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ నుంచి డిసెంబర్‌ మొదటి వారంలో నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నామన్న అధికారులు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామన్న అధికారులు. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకు టన్నెల్‌ –2 ను వేగంగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. నెల్లూరు బ్యారేజీలో సివిల్‌ పనులు దాదాపు పూర్తికావొచ్చాయన్న అధికారులు. గేట్ల బిగింపు ప్రక్రియను మొదలుపెట్టామన్న అధికారులు, మొత్తంగా 86.35శాతం పనులు పూర్తి. నవంబరు నెలాఖరు నాటికి పూర్తిచేస్తామని, సంగం బ్యారేజీకూడా నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు. వంశధార – నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు. వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్‌–2, స్టేజ్‌–2
పనుల ప్రగతిపై సీఎం ఆరా. పనులు వచ్చే మార్చినాటికి పూర్తిచేస్తామన్నఅధికారులు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఇప్పటికే ఒడిశా సీఎంతో చర్చలకోసం ముఖ్యమంత్రిగారు లేఖరాసిన అంశాన్ని గుర్తుచేశారు. దీని రిప్లైకోసం వేచిచూడకుండా, వారితో మాట్లాడి ఒడిశా సీఎంతో చర్చలకు ఖరారుచేయాలన్న సీఎం. అలాగే జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టాలన్న సీఎం.

పోలవరం ప్రాజెక్టు:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై వివరాలు అందించిన అధికారులు కోవిడ్‌ సమయంలోకూడా పనులు కొనసాగించామని వెల్లడించిన అధికారులు పోలవరం స్పిల్‌వే పిల్లర్స్‌ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందన్న అధికారులు సెప్టెంబరు 15 కల్లా స్పిల్‌వే పిల్లర్స్‌ పనులు పూర్తవుతాయన్న అధికారులు వర్షాకాలంలో కూడా పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామన్న అధికారులు అలాగే ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు పోలవరం సహాయ పునరావాస పనులపైనా సీఎం సమీక్ష పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు వీలుగా అవసరమైన ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తిచేయాలన్న సీఎం ఈసారి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపాలని అధికారులకు సీఎం ఆదేశం  చిత్రావతిలో 10 టీఎంసీల నీటిని కూడా నిల్వచేయాలన్న సీఎం గండికోట– పైడిపాలెం లిఫ్ట్‌ అప్‌గ్రెడేషన్‌ పనులు కూడా త్వరగామొదలుపెట్టాలని సీఎం ఆదేశం రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులు పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని సీఎం ఆదేశం టెండర్‌ ప్రక్రియ జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్లిందన్న అధికారులు జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు లింక్‌ చేసే లిఫ్ట్‌ పనులు కూడా త్వరగా మొదలుపెట్టాలని ఆదేశం పులివెందుల మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు కూడా వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశం

Just In...