Published On: Wed, Sep 9th, 2020

అద‌ర‌హో అనేలా.. అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు…

* అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: మౌలిక స‌దుపాయాలు పూర్థిస్థాయిలో క‌ల్పించి ప్ర‌జ‌లంద‌రూ అద‌ర‌హో అనేలా అంగ‌న్‌వాడీ కేంద్రా‌ల రూపురేఖ‌లు మార్చాల‌ని సీఎం ‌వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ‌తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు
చెందిన పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్ మాట్లాడారు. అంగన్‌వాడీల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దు. కిండర్‌ గార్టెన్‌ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అంగన్‌వాడీలలో కూడా నాడు–నేడు కార్యక్రమంలో రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న పెద్ద మరమ్మతులు, విద్యుద్దీకరణ, కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు, ప్లే జోన్‌ (క్రీడా స్థలం) ఉండేలా మార్పులు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరికులమ్‌ కమిటీలు, ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై కూడా మానిటరింగ్‌ చేయాలి. అంగన్‌వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ విషయంలో పక్కాగా ఉండాలి, మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలి. కొత్తగా 27,438 భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొత్త భవనాల నిర్మాణంలో తొలి దశలో 17,984, రెండో దశలో 9454 కేంద్రాల నిర్మాణం. తొలి దశ పనులు ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టాలని, రెండో దశ పనులు వచ్చే ఏడాది నవంబరు 14న మొదలు పెట్టాలని యోచన. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేసి, ఆ తర్వాత అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, మెటీరియల్‌ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేసుకుని, ఈ ఏడాది డిసెంబరు 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు: (పీపీ–1, పీపీ–2) అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల (ఎంకేఎస్‌) సూపర్‌వైజర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడడం కోసం సాధన – మొబైల్‌ యాప్‌. నవంబరు రెండోవారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. 

Just In...