Published On: Mon, Sep 14th, 2020

108 వాహనంలో ప్ర‌స‌వించిన మ‌హిళ…

కడప జిల్లా, సెల్ఐటి న్యూస్‌: 108 వాహనంలో పండంటి బిడ్డకు ఓ త‌ల్లి జన్మనిచ్చింది. పుల్లంపేట మండలం కుమ్మరోని పల్లెలో టి.బుజ్జమ్మ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు సోమ‌వారం ఉద‌యం ‌108కి కాల్ చేశారు. హుటాహుటిన ఆమెను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బుజ్జ‌మ్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో బంధువులు, హాస్పిటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు.

 

Just In...