Published On: Tue, Sep 15th, 2020

న‌మ్మ‌శ‌క్యం కావ‌టం లేదు…

* వైఎస్ఆర్ ఆస‌రాప‌ట్ల మ‌హిళ‌ల హ‌ర్షం

విజ‌య‌‌నగ‌‌రం, సెల్ఐటి న్యూస్‌: వంద‌లూ వేలు కాదు… ఏకంగా ల‌క్ష‌ల రూపాల‌య‌ను రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త మ‌న‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డిదేన‌ని మ‌హిళ‌లు కొనియాడారు. ఇంతటి భారీ మొత్తాన్ని రుణ‌మాఫీ చేశారంటే, ఇప్ప‌టికీ న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఇలాంటి క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా మ‌మ్మ‌ల్ని ఆదుకొని, మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని ముఖ్య‌మంత్రిగా త‌న‌ పేరు మ‌రోసారి నిల‌బెట్టుకున్న‌ ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌వ‌ల్ల ఇప్పుడు ప్ర‌తీ కుటుంబ‌మూ ఆర్థికంగా నిల‌దొక్కుకుంద‌ని, దిశ లాంటి సాహ‌సోపేత చ‌ట్టాల ద్వారా మ‌హిళ‌లంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని డ్వాక్రా మ‌హిళ‌లు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

క‌నీవినీ ఎరుగ‌ని రుణ‌మాఫీ…
కె.ల‌క్ష్మి, దండుమార‌మ్మ పొదుపు సిరి సంఘం, విజ‌య‌న‌గ‌రం మా సంఘానికి 5ల‌క్ష‌ల‌, 30వేల రూపాయ‌లు రుణ‌మాఫీ చేయ‌డాన్ని మేము ఇప్ప‌టికీ న‌మ్మ‌లేకుండా ఉన్నాం. ఇంత మొత్తాన్ని మాఫీచేసి, ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తార‌ని మేము ఎన్న‌డూ ఊహించ‌లేదు. ఇది క‌లా నిజ‌మా అన్న‌ట్టుగా ఉంది. మ‌మ్మ‌ల్ని అప్పుల‌బారినుంచి బ‌య‌ట ప‌డేసిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డిగారిని మేమంతా రుణ‌ప‌డి ఉంటాం.

క‌నిపించే దేవుడు జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి
ర‌హీనా, వెంక‌ట‌క్రాంతి పొదుపు సిరి సంఘం, విజ‌య‌న‌గ‌రం. మా సంఘానికి 4ల‌క్ష‌ల‌, 22వేలు రుణం మంజూర‌య్యింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మ‌హిళ‌ల ‌కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. వైఎస్ఆర్ ఆస‌రాతోపాటుగా, చేయూత‌, అమ్మఒడి లాంటి ప‌థ‌కాల‌తో పాటు, దిశ చ‌ట్టాన్ని కూడా తీసుకువ‌చ్చి మా సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్నారు. మా పిల్ల‌ల‌కు విద్యాదీవెన‌, వ‌స‌తిదీవెన లాంటి ప‌థ‌కాల‌ను కూడా తెచ్చారు. ఆయ‌న మాకు క‌నిపించే దేవుడులా భావిస్తున్నాం.

చాలా సంతోషంగా ఉంది
* ఎం.వాణిశ్రీ‌, శ్రీ‌పావ‌నీ పొదుపు సిరి సంఘం, విజ‌య‌న‌గ‌రం ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి మా రుణాల‌ను మాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్ ‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాము. ఎన్నిక‌ల ముందు రుణ‌మాఫీకి సంబంధించి హామీ ఇచ్చిన‌ప్పుడు మాకు ఏమాత్రం న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. ఎందుకంటే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అప్ప‌టి నాయ‌కులు ఇచ్చిన హామీ అమ‌లుకు నోచుకోక మేమంతా
మోస‌పోయాము. మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌గారు పేరు నిల‌బెట్టుకున్నారు.

ఇది చేత‌ల ప్ర‌భుత్వం…
* పి.కృష్ణ‌వేణి, మ‌రిడ‌మ్మ పొదుపు సిరి సంఘం, విజ‌య‌న‌గ‌రం. నేను ఉన్నాను అని మాట ఇవ్వ‌డ‌మే కాకుండా, ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్‌‌రెడ్డికే ద‌క్కుతుంది. మా సంఘానికి ఏకంగా 5ల‌క్ష‌ల‌, 92వేల రుణం మాఫీ అయ్యింది. ఇంత భారీ మొత్తాన్ని మాఫీ చేస్తార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. ఒక్క వైఎస్ఆర్ ఆస‌రాలోనే కాకుండా, జ‌గ‌న‌న్న చేదోడు, చేయూత‌, అమ్మఒడి, వ‌స‌తి దీవెన‌, విద్యా దీవెన లాంటి ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేశారు. జ‌గ‌న్ గారి ప‌థ‌కాల వ‌ల్ల ల‌బ్ది పొంద‌ని కుటుంబ ప్ర‌స్తుతం లేదంటే అతిశ‌యోక్తి కాదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా మా మ‌హిళా సంఘాల చేత మాస్కులు క‌ట్టించి మాకు ఆర్థికంగా ఆదుకున్నారు.

 

Just In...