Published On: Tue, Sep 15th, 2020

విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకునే నాయకుడు జ‌గ‌న్‌

* ఆసరా వారోత్సవాల్లో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల్ని ఆదుకునే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వంటి నాయకుడు ఉన్నందుకు అంతా గర్వపడాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని లూనా సెంటర్‌లో ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో పాల్గొన్న మల్లాది విష్ణు తొలుత మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గాన్ని ఆదుకుంటుందన్నారు. నియోజక వర్గంలో అమ్మ ఒడి పథకం ద్వారా సుమారు 29వేల మంది లబ్దిపొందారన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకం కింద 15వేల మంది గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.2019 మే 30 నాటికి నియోజకవర్గంలో పెన్షన్ల సంఖ్య 18,852 కాగా ఈ 14 నెలల కాలంలో 22,100 పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్‌ మంజూరులో ఎవరి ప్రమేయం లేకుండా కులం, మతం ,పార్టీ చూడకుండా అర్హులైన
ప్రతి ఒక్కరికి పెన్షన్‌ మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ తలుపు తడితే ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు అందించేందుకు అక్కడ సిబ్బంది సిద్దంగా ఉన్నారన్నారు. సచివాలయ సిబ్బంది ఇష్టానుసారం ప్రవర్తించడానికి వీల్లేదని, అటువంటివారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. సచివాలయాలు, వలంటీర్‌ల ద్వారా వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారన్నారు. ప్రతి వీఢిలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు వంతెనల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నాడు, నేడు కార్యక్రమం ద్వారా బడులు, ఆసుపత్రులను అభివృద్ది చేస్తున్నామన్నారు. విద్య,వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన చెత్త సమస్యను ఆగమేఘాల మీద పూర్తి చేశామన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. వైఎస్సార్‌పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకుని ప్రభుత్వ పథకాలను విస్రృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న వార్డు సచివాలయాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు మేం ఉన్నామని భరోసా కల్పించడానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉందన్నారు.

Just In...