Published On: Thu, Sep 17th, 2020

మానవతా థక్పతంతో పని చేసి పోలీసులు ఆదర్శంగా నిలవాలి

కర్నూలు క్రైం, సెల్ఐటి న్యూస్‌: తిరుపతి పిటిసి నుండి 66 మంది పురుష సివిల్ పోలీసు కానిస్టేబుల్స్ , ఒంగోలు పిటిసి నుండి 32 మంది మహిళా సివిల్ పోలీసు కానిస్టేబుల్స్ ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేసుకున్నారు. వీరికి అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్.ఈ.బి అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ ఐపియస్ కొమ్మి ప్ర తాప్ శివకిషోర్, ట్రైనీ డిఎస్పీ భవ్యకిషోర్‌లు శిక్షణ పూర్తి చేసుకున్న పురుష, మహిళ కానిస్టేబుళ్ళకు పోలీసుల విధుల పట్ల అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను నిత్యం గుర్తుంచుకోవాలన్నారు.
వృతిలో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. పోలీసుశాఖ గౌరవం పెంపొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. నిజాయితీ, నిబద్దతో పని చేయాలన్నారు. సమస్యలతో, బాధలతో పోలీసుస్టేషన్ల‌కు ప్రజలు వస్తుంటారని వారితో మానవత థృక్పతంతో వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. కోవిడ్ 19 నిబంధనలు, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ పార్టీ ఆర్.ఐ సుధాకర్, ఆర్.ఎస్సైలు పోతల రాజు, హుస్సేన్ ఉన్నారు.

Just In...