Published On: Sat, Sep 19th, 2020

దుర్గాఘాట్‌లో కృష్ణమ్మ నదీహారతులు పునఃప్రారంభం

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: దుర్గాఘాట్‌లో కృష్ణమ్మ నదీహారతులు శుక్రవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భంగా రుత్వికులు కృష్ణవేణి మాతకు పసుపు కుంకుమ పూజా ద్రవ్యాలతో పూజాదికాలు నిర్వహించారు.
దుర్గాఘాట్‌లో హారతులు ఇచ్చే ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆరు నెలలుగా ఘాటు వదిలివేయడంతో పారిశుద్ధ్య సిబ్బంది ఘాట్ లోప‌ల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొల‌గించారు. మెట్లును పరిశుభ్రం చేశారు. అనంత‌రం తొమ్మిది హారతులు వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ రుత్వికులు సమర్పించారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ప్రకాశం బ్యారేజీ పైనుంచి కూడా భక్తులు కృష్ణవేణి మాతకు సమర్పించిన హారతులను తిలకించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాదశర్మ, దుర్గాప్రసాద్, కోట ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Just In...