Published On: Tue, Sep 22nd, 2020

హిందూ దేవాలయాలపై దాడులను నియంత్రించాలి

* ఎమ్మెల్యే గద్దె రామ‌మోహ‌న్

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: భారతదేశంలో ఏమతం వారైనా ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయముందని, ఇటీవల కాలంలో హిందువుల దేవాలయాలపై దాడులు, విధ్వంసకాండలు జరుగుతున్నాయని, స్వయంగా ఒక మంత్రే ఆంజనేయ స్వామి చేతులు విరగొడితే ఏమైంది ? రధాలు తగలబడితే ఎవరికైనా నష్టమా ? తిరుమలలో అన్యమతస్తులు సంతకం పెట్టాలని ఎవరు చెప్పారు? అని మాట్లాడటం కేవలం రాజకీయ లబ్ధికోసమే అన్నట్లు కనపడుతుందని , వ్యక్తుల మొప్పుకోసం, అనాదిగా
వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మంటగలిపే హక్కు ఎవరికీ లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఫుల్ స్టాప్ పెట్టించాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం గద్దె రామమోహన్ 5వ డివిజన్ అమ్మ కళ్యాణమండపం ఏరియాలో సమస్యల పరిష్కారంలో భాగంగా పర్యటించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో గద్దె రామమోహన్ మాట్లాడుతూ హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరి మత ఆచారాలు
వారికుంటాయని, మనరాష్ట్రంలో అన్ని మతాల వారు ఎవరి ఆచారాలు వారు పాటిస్తూ, ఎదుటి మతాల వారి పండుగలలో పాలు పంచుకునే సాంప్రదాయం ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందని, ముస్లింలకు మక్కా అతిపవిత్ర స్థలమని, అక్కడ ముస్లింలు తప్ప వేరొకరు ఆ ప్రార్ధనా స్థలానికి వెళ్ళే అవకాశం లేదని, అది ముస్లింల సాంప్రదాయమని, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా దానికి 20 కి.మీ దూరం నుంచి బైనాక్యులర్ ద్వారా చూసిన సందర్భం ఉందని వారి మత విశ్వాసాలను అందరూ గౌరవిస్తారన్నారు. అలాగే క్రైస్తవులలో కూడా ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క సాంప్రదాయం ఉందని, వాటిని అందరూ గౌరవించాల్సిందేనని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ బయటకు వచ్చి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించాలని గద్దె రామమోహన్ కోరారు.
కార్మికశాఖా మంత్రి జయరామ్ రాజీనామా చేయాలి ఇ.ఎస్.ఐ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన మంత్రి జి.జయరాం తక్షణమే రాజీనామా చేయాలని శాసనసభ్యులు గద్దె డిమాండ్ చేశారు. ఇ.ఎస్.ఐ స్కాంలో 14 వ నిందితుడుగా ఉన్న కార్తీక్ మంత్రికి బినామి అని, మంత్రి కుమారుడికి పుట్టినరోజు కానుకగా కార్తీక్
బెంజికారును బహుమానంగా ఇచ్చాడని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధారాలతో సహా నిరూపించారని, ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి జయరామ్ ఇంత వరకు ఎందుకు రాజీనామా చేయలేదని గద్దె రామమోహన్ ప్రశ్నించారు.
ఏ ఆధారాలు లేకుండానే అచ్చెం నాయుడిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం మంత్రిపై ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నారు. మంత్రి జయరామ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎంక్వయిరీ చేయాలని గద్దె రామమోహన్ కోరారు. అమ్మ కళ్యాణమండపం ఎదురుగా గల బస్ స్టాప్ వద్ద 15 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నామని బస్ షెల్టర్ ప్రక్కన కార్పొరేషన్ వారు అక్కడ గుంటలు త్రవ్వి బాత్ రూంలు నిర్మిస్తున్నారని దాని వల్ల తమకు జీవనం పోతుందని తెలుపగా, గద్దె రామమోహన్ కార్పొరేషన్ అధికారులను పిలిపించి మాట్లాడగా,
అవి టాయిలెట్స్ కాదని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వారు షెల్టర్ ప్రక్కన బడ్డీ ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని గద్దె వారికి సూచించారు. అలాగే మొగల్రాజపురం కొండ మీద నుంచి ద్విచక్రాలపై వచ్చే వారు
స్పీడుగా వస్తున్నారని, అక్కడ స్పీడు బ్రేకర్ ఏర్పాటు చేయాలని, సైడు కాల్వలు పూడికలు తీయాలని అలాగే క్రీస్తురాజపురం మెయిన్ రోడ్డుకు ఫైనల్ లేయర్ వేయాలని స్థానికులు గద్దె రామమోహన్ తెయజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు నందిపాటి దేవానంద్, బూరగ విజయ్, గుడేటి
వెంకటేశ్వరరావు, రాచమళ్ళ ఆంజనేయులు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Just In...