Published On: Tue, Sep 22nd, 2020

డియస్సీ – 2018 యస్‌జిటీ పోస్టుల భ‌ర్తీ

* ఈ నెల 24న సర్టిఫికెట్ వెరిఫికేషన్

* 25, 26 తేదీల్లో నియామక ఉత్తర్వులు

* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: డియస్పి-2018లో మొత్తం 7902 పోస్టులు భర్తీకి పరీక్షలను నిర్వర్తించడం జరిగిందని, అందులో భర్తీ కాకుండా ఉన్న పోస్టులలో 52 పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లో మంగళవారం విలేఖరుల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ. కరోనా వంటి కష్టకాలంలో కూడా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చూపుతున్న నిబద్ధతకు ప్రజలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో డియర్ పి-2018 నిర్వహించిన వాటిని భర్తీ చేయడం జరగలేదన్నారు. తాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లి, హైకోర్టు వారు విట్ పిటీషన్ నెం.15355/2019 పై 21.09.2020 న గవర్నమెంట్ కు సాముకూలంగా డిస్పోజల్ చేసినందున. టి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే 2203 మంది అభ్యర్థులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసామని, ఈ రోజు మరో 1321 మందికి సంబంధించిన ప్రక్రియము కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు వెరిఫికేషన్ పూర్తి అయిన అభ్యర్థులకు వారి ధృవపత్రాలను సంబంధిత వెబ్ పోటోలో అప్లోడ్ చేసేందుకు సెప్టెంబరు 23న వారి సెల్ ఫోన్లో సందేశాలను పంపడం జరుగుతుందన్నారు. సంబంధిత అభ్యర్థి జిల్లా ఎడ్యుకేషన్ పేపర్ కార్యాలయానికి వెళ్లి ఈ నెల 4న సర్టిపి కట్ లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. డిఇఓ ఆఫీసుల వద్ద, విద్యాశాఖ పోర్టల్ వందు 24వ తారీఖున వాన, 4వ కేటగిరీలకు మరియు ఇతర రిమోట్ ప్రాంతాల ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు సెప్టెంబరు 25, 26 తారీకుల్లో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపత్రాలను అదేరోజు అందజేయడం జరుగుతుందన్నారు ఎంపిక కాబడిన అభ్యర్థులు సెప్టెంబరు 28 వ తేదీ నుండి తప్పనిసరిగా విధుల్లో జాయిన్ అవ్వాలని చెప్పారు. ఇంకా 949 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాల్సి ఉందని, ఇందులో భాగంగా 374 భాషాపండిట్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 486 పిఇటి పిడి పోస్టులు, రి ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కోర్టు ఆదేశాలు ఆధారంగా నియామకాలు భర్తీ చేపట్టాల్సి ఉందన్నారు స్పెషల్ డి ఎస్ 2019 క్రింద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15.2.2019 న మొత్తం 602 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇందులో భాగంగా 14.9.2020 నాటికి మొత్తం 492 పోస్టులు భర్తీ చేస్తూ ఎంపిక కాబడిన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేశామన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించి 1ేదీ, 14.9.2020 వ తేదీన మొత్తం 2921 మందికి నియామక ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1440 శు నోటిఫై చేయగా, 1275 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అదే విధంగా లాంగ్వేజ్ పండిట్ 253 పోస్టుల 187, వీటిలో 311 కు గాను 272, మ్యూజిక్ కేటగిరీలో 76 కు 67. ఆర్ట్ అండ్ డ్రాయింగ్ కేటగిరీల్లో 22 కు 20, క్రాఫ్ట్ కేటగిరీల్లో 25కు 24, పోస్టు గ్రాడ్యుయేట్ కేటగిరీలో 583 కు 395, ట్రైయిన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కేటగిరీలో 115 పోస్టులను నోటిఫై చేయగా, వాటిలో ర8 మందికి నియామక ఉత్తర్వులను ఇచ్చామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్.
జగన్మోహన్ రెడ్డి గే చెల్లిందన్నారు. ఇప్పటికే 9700కు పైగా పారామెడికల్ పోస్టులు భర్తీ చేపారని, 7902 డిఎస్పి- 2018 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేయడం జరుగుతోందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయాలకు చెందిన 16 వేలకు పైగా పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారన్నారు త్వరలోనే డియస్ సీ 2020 నిర్వహిస్తామన్న ఆశాభావాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యక్తం పరిచారు. పెండింగ్ లో ఉన్న డియస్పి లకు కూడా త్వరలోనే సానుకూల ఉత్తర్వులు వెలువడుతాయని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు జాతీయ విద్యా విధానం సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మిగతా అన్ని రాష్ట్రాల కంటే వేగంగా అడుగులు వస్తున్నారని తెలిపారు. విద్యా సంవత్సరం కు సంబంధించి 222 పనిదినాలు ఉండాలని, ప్రస్తుతం 20 నుంచి 30 శాతం పనిదినాలు కోల్పోయామని,అందుకు అనుగుణంగానే సిలబస్ కు ప్రాధాన్యత ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే త్వరలోనే తరగతులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అక్టోబరు 5వ తేదీ తర్వాత తరగతులను నిర్వహించవచ్చని తెలిపారు. నెట్ పరీక్షలను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించి క్రొత్త ఎడ్యుకేషన్ పాలపీకి అనుగుణంగా విధివిధానాలను, సిలబస్ రూపొందించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కి సంబంధించ సీట్ల భర్తీ పై తల్లిదండ్రులు, విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారని, ఈసీట్ల భర్తీ 10వ తరగతి పైన్స్, మ్యాథ్స్, పోషల్ స్టడీస్ మార్కుల ఆధారంగా చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై రేపు సాయంత్రం నిర్ణయం తీసుకున్నాక వివరాలను తెలపడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి ఆ విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు విడిగా పరీక్షలు నిర్వహించి, ఆమార్కుల ఆధారంగా ట్రిపుల్ బటి సీట్లు భర్తీ చేయాలా అనే అంశంపై గవర్నింగ్ కౌన్సిల్ ఆర్జి కెటి (స్వయంప్రతిపత్తి గల యూనివర్సిటి), ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్ లు, ముఖ్యకార్యదర్శులతో రేపు సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని, తదనంతరం దానికి సంబంధించిన వివరాలను విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అందజేయాల్సిన పుస్తకాలు. స్కూల్ బ్యాగ్స్, సాలు యూనిఫారంలు సంబంధిత జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, మందుల కేంద్రాల నుంచి పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల రేషియో ఆధారంగానే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కూడా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Just In...