Published On: Thu, Oct 15th, 2020

విద్యార్థిని ప్రాణం తీసిన‌ ప్రేమోన్మాది…

* నేరుగా యువ‌తి ఇంటికి వెళ్ళి క‌త్తితో పొడిచిన వైనం

* ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతూ యువ‌తి మృతి

* భ‌య‌బ్రాంతుల‌కు గురైన విజ‌య‌వాడ ‌వాసులు

* యువ‌తి కుటుంబానికి ప‌లువురు రాజ‌కీయ నేత‌ల ప‌రామ‌ర్శ‌

* నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరిన స్థానికులు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది పైశాచికత్వానికి ఓ యువతి బలైంది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని క్రీస్తురాజుపురంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదంటూ దివ్య‌తేజ‌స్విని అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో మెడపై పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అక్కడ‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిపై దాడి తర్వాత ఉన్మాది తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. గాయపడిన యువకుడిని కూడా చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఈ ఘ‌‌ట‌న న‌గ‌ర‌వాసుల‌ను భ‌య్రాంతుల‌కు గురిచేసింది. తమ కళ్ల ముందే దారుణంగా బిడ్డ‌ను హత్య చేసి త‌మ ఆశల సౌధాన్ని కూల్చివేసిన ఇలాంటి మానవ మృగాలను వేటాడి చంపేయాలని లేకుంటే ఇలాగే మ‌రిన్ని మోసాలకు ఆడపిల్లలు మోసపోయి బలవుతారని, నిందితుడిని శిక్ష భయంకరంగా ఉండాలని, వాడికి బ్రతికే హక్కు ఉండకూడదని కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. ఎవరో కన్న బిడ్డలను ప్రేమపేరుతో ఇలా మానవమృగాలు కొందరు చంపేయ‌డం మామూలైంద‌ని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే కొంతవరకైనా నిలువరించే వీలవుతుందన్నారు. ఆమెను దారుణంగా హత్య చేసిన ప్రేమ మృగం ఆమెను చంపి తనకు తానే కత్తితో గాయ పర్చుకున్నాడని తెలిసింది. ఈ విషయంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ నిందితుడు కొద్దికొద్దిగా మాట్లాడుతున్నాడని, పూర్తి‌ వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు. నిందితుడిని చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, హత్యకు గురైన దివ్య తేజస్విని మృత‌దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు.
యువతి కుటుంబాన్ని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప‌రామ‌ర్శించారు. అలాగే వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ఆసుప‌త్రికి వ‌చ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తేజ‌స్విని కుటుంబ‌స‌భ్యుల‌ను పరామర్శించారు. ఈ విషయంలో ఇలాంటి నేరం చేసిన వారికి న్యాయవ్యవస్థ స్పందించాలన్నారు. కళ్ళముందే ఇలాంటి వారిని దిశా చట్టం క్రింద క్రూరంగా ఉరి వేస్తే కొందరికి భయం కలుగుతుందన్నారు. ఇలా ఉండగా ఇలాంటి రాక్షులకు తమ ఇంట్లొ కూడా ఆడపిల్లలు ఉన్నారనే ఇంగితం లేకపోవటం, ఇంటిలో తలిదండ్రులు క్రమశిక్షణతో పెంచకపోవటం వలనే ఇలాంటివారు తయారవుతున్నారు. ఇలాంటివారిని క్రూరంగా శిక్షిస్తే గాని మిగిలిన వారికి భయం రాదని, అప్పుడే ఈ రాక్షస చర్యలు అగుతాయని నగర ప్రజలు భావిస్తున్నారు.  నిందితుడు ఇంటి ప్రక్కల వారు మాట్లాడుతూ ఇలాంటి వాడిని కాల్చిపారేయాల‌న్నారు. పచ్చి దుర్మార్గుడిని నరికి చంపాలని, ఆ పాప చాలా మంచిదని ఆమె మరణంతో తలిదండ్రులు కృంగిపోతున్నారని మహిళలు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇది ఇలా ఉండగా నిందితుడి కుటుంబ సభ్యులను పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు.  

Just In...