Published On: Sat, Oct 17th, 2020

భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అమ్మ‌వారి ద‌ర్శ‌నం

* ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కోవిడ్-19 నిబంధలను పాటిస్తూ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాససభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు శనివారం స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఇంద్రకీలాద్రి మీడియా సెంటరు నుండి ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు శరన్నవరాత్రి ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. శ‌నివారం ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంచి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో అన్నిఏర్పాట్లు చేశారన్నారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని రోజుకు పది వేల మంది భక్తులు మాత్రమే కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న రెండో శరన్నవరాత్రి ఉత్సవాలన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే దసరా ఉత్సవాల్లో సుమారు రోజుకు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారని, నేడు కొవిడ్-19 ప్రభావం వలన పరిమిత సంఖ్యలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనిమతించేలా ఏర్పాట్లును చేశామని శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాల్లో కొవిడ్ నిబంధలను కారణంగా భక్తులు అమ్మవారికి సమర్పించే కేశఖండన, నదీ పుణ్య స్నానాలను నిలుపుదల చేశామన్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలతో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా వర్షించి జలాశయాలు నిండుకుండలా ఉన్నాయన్నారు. భక్తుల సౌకర్యార్థ్యం ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అనతి కాలంలోనే క‌నకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను ప్రారంబించుకున్న‌ట్లు చెప్పారు. కనకదుర్గమ్మ కరుణా కాటాక్షలు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, పాడి పంటలతో  ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని అమ్మవారిని కోరుకున్న‌ట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు.

 

Just In...