Published On: Sat, Oct 17th, 2020

భారీగా హ‌వాలా న‌గ‌దు స్వాధీనం

* ముగ్గురు నిందితులు అరెస్టు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.35 లక్షలు నగదు మరియు 1- బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు వ‌చ్చిన పక్కాసమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపి వి.ఎస్.ఎస్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్ మరియు వారి సిబ్బందితో కలసి భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని, పిఆర్‌కె బిల్డింగ్ సమీపంలో ఏపీ 16 ఎఫ్ 4962 నెంబర్ గల హోండా యాక్టివా మోటారు సైకిల్ లో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.35 లక్షల నగదు మరియు1-మోటారు సైకిల్, 3-సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. విజయవాడ, భవానీపురం, గుడివాడ రామారావు వీధికి చెందిన రావి వెంకట నారాయణ(40) .రాజస్థాన్, స్టీల్ రైలింగ్, బికానెర్, చెందిన సత్యేంద్ర సింగ్ రాజ్ పుట్(34) . గుంటూరు జిల్లా, మాచర్ల మండలం, పిడుగురాళ్ల చెందిన తెల్లాకుల సత్యనారాయణ (45) విచారించ‌గా నిందితులలో రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్ర సింగ్ రాజ్ పుట్ అను అతను విజయవాడకు చెందిన రావి వెంకట నారాయణ అను అతని దగ్గర ఎటువంటి పిల్లలు లేకుండా హవాలా రూ.35 లక్షలు గ‌న‌దును భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి పి.ఆర్.కె. బిల్డింగ్ వద్ద తీసుకుని సదరు నగదును గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ చెందిన తెల్లాకుల సత్యనారాయణకు రాజస్థాన్‌కు చెందిన పప్పు సింగ్ రాజ్ పుట్ ఇచ్చిన కోడ్ను సత్యేంద్ర సింగ్ రాజ్ పుట్ కు చూపించడంతో సదరు కోడ్ ప్రకారం సదరు హవాలా నగదును సత్యనారాయణకు అంద చేయుచుండగా టాస్క్ఫోర్స్ పోలీస్ వారికి ఇచ్చిన సమాచారం మేరకు పై ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తు నిమిత్తం భవానీపురం పోలీసుల‌కు నిందితులను అప్పగించారు. ఆదాయ ప‌న్ను శాఖ అధికారులకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారికి సమాచారం ఇచ్చారు. ఈసందర్భంగా హవాలా నగదుసు తరలిస్తున్న నిందితులను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్  సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.

 

Just In...